స్త్రీలు సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదు..?

-

గుడికి వెళ్తే.. గంటకొట్టి ప్రసాదం తీసుకోవడం కంటే.. ముందు దేవుడికి నమస్కారం చేస్తుంటారు. ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్.. అయితే చాలామంది దేవుడికి సాష్టాంగ నమస్కారం చేస్తుంటారు. దేవుడి ముందు బోర్లా పడుకుని నమస్కారం చేయడం.. కానీ మహిళలు సాష్టంగ నమస్కారం చేయకూడదని మన పండితులు అంటారు.. కేవలం పురుషులు మాత్రమే ఇలా చేస్తారు. అసలు లేడీస్ ఎందుకు చేయొద్దు..?
సాష్టాంగ అంటే 8 అంగాలతో నమస్కారం చేయడమని అర్థం. మనిషి సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయాల్లో బోర్లా పడుకుని ఆ అంగాలతో చేసిన తప్పులను క్షమించమని వేడుకోవడం ఈ నమస్కారం వెనుక ఉన్న అర్థం.. ఉరస్సుతో నమస్కారం చేసేటపుడు ఛాతి, శిరస్సుతో నమస్కారం చేసేటపుడు నుదురు, దృష్టితో నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని తలుచుకోవాలి.
మనస్పూర్తిగా మనస్సుతో నమస్కారం చేయాలి. వచసా నమస్కారం అంటే ఇష్ట దైవాన్ని మాటతో స్మరించాలి. పద్భ్యాం నమస్కారం అంటే రెండు పాదాలు నేలకు, కరాభ్యాం నమస్కారం అంటే రెండు చేతులు, జానుభ్యాం నమస్కారం అంటే రెండు మోకాళ్ళు నేలకు తగులుతూ నమస్కారం చేయాలని పురాణాల్లో పేర్కున్నారు.

స్త్రీలు సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదంటే….

స్త్రీలు కేవలం పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి. అంటే కాళ్లు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చేయాలని శాస్త్రం చెబుతోంది. స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయాలంటే పొట్ట నేలకు తాకుతుంది. ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది. పాలిచ్చి పోషించే వక్ష స్థలం కూడా నేలకు తాకాల్సి ఉంటుంది.. ఇలా చేయడం వల్ల ఏదైనా జరగరానిది జరిగే అవకాశం ఉంది. మన శాస్త్రాల్లో స్త్రీకి గొప్ప విలువ ఉంటుంది. సృష్టికి ఆధారమైన, పోషణకు ఆధారమైన స్థలం నేలకి తాకకూడదనే ఉద్దేశంతో స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయరాదు అనే నియమం పెట్టారు. కానీ చాలామంది స్త్రీలు గుళ్లల్లో సాష్టాంగ నమస్కారం చేస్తుంటారు.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version