త్వరలో కచ్చితంగా క్రియాశీల రాజకీయాల్లో వస్తానని ప్రియాంక గాంధీ భర్త, వ్యాపార వేత్త రాబర్ట్ వాద్రా అన్నారు. తాను రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి వచ్చే సూచనలు ఉన్నట్లు వెల్లడించారు.
ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తాను ఎవరికీ సమాధానం చెప్పడానికి రాజకీయాల్లోకి రావడం లేదని.. ప్రజలకు సేవ చేయడానికి రావాలనుకుంటునట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ మీద నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ప్రధానిగా ఇలాంటి మాట్లాడటం తగదని అన్నారు. ఇక శ్యామ్ పిట్రోడా చేసిన వాఖ్యలపైనా వాద్రా స్పందించారు.గాందీ కుటుంబంతో కలిసి పనిచేస్తున్నప్పుడు బాధ్యతగా ఉండాలని, ఏదైనా మాట్లాడే ముందు ఆచితూచి వ్యవహరించాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికల కోసం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కష్టపడి పనిచేస్తున్నారని.. కానీ పిట్రోడా చేసిన ఒకే ఒక్క ప్రకటనతో బీజేపీకి దీన్ని ఓ అంశంగా మలిచే అవకాశం కల్పించారని అసహనం వ్యక్తం చేశారు. కాగా అమేథీ ఎంపీ టికెట్ ను ఓ దశలో వాద్రా ఆశించిన సంగతి తెలిసిందే. కాగా ,ఆ స్థానాన్ని కేఎల్ శర్మకు కాంగ్రెస్ కేటాయించింది.