పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలకు దూరం కానున్నారా..?

-

పవన్ కళ్యాణ్.. ఇటు పాలిటిక్స్, మూవీస్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన వకీల్‌సాబ్, భీమ్లానాయక్ సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ ఎనర్జీ రెట్టింపైందని చెప్పుకోవచ్చు. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కూడా స్లోరీలు రెడీ చేసుకున్నారు. అయితే తాజాగా ఒక వార్త మాత్రం అందరినీ కలవరపెడుతోంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తారా..? లేదా? అనేది ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. సినిమా కంప్లీట్ అవుతుందా? అసలు ఫస్ట్ క్లాప్ అయినా పడుతుందా? అని అందరికీ డౌట్ వస్తోంది.

పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్

ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ నడుస్తోంది. ఆ తర్వాత సముద్రఖని, హరీశ్ శంకర్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాల్లో నటిస్తారని టాక్. అయితే ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమాలు ముందుగానే కంప్లీట్ చేస్తారని మేకర్స్ చెబుతున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే భిన్నంగా ఉంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అక్టోబర్ 5వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ జనంలోకి వెళ్లనున్నారు. దీంతో నిర్మాతల్లో భయం మొదలైంది. ఇప్పుడు సినిమాలను, పొలిటికల్‌ టూర్‌ను ఎలా మ్యానేజ్ చేస్తారో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news