యూఎన్‌లో భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతిస్తాం : అమెరికా

-

యూనైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో భారత్, జర్మనీ, జపాన్ శాశ్వత సభ్యత్వాలకు తాము మద్దతిస్తామని అమెరికా మరోసారి పునరుద్ఘాటించింది. ఆఫ్రికా దేశాలకు తాత్కాలిక సభ్వత్వాలతో పాటు 2 శాశ్వత సభ్వత్వాల సృష్టికి తమ మద్దుతు కొనసాగుతుందని అంతర్జాతీయ భద్రతా మండలిలో అమెరికా అంబాసిడర్ లిండా థామస్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశం భారత్.మండలిలో నిజంగానే వారికి మేం మద్దతిస్తాం.వారి శాశ్వత సభ్యత్వాన్ని తిరస్కరించే పరిస్థితులు లేవు’ అని పేర్కొన్నారు.ఇదిలాఉండగా, గతంలోనే యూఎన్‌లో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కోసం అమెరికా ప్రతిపాదించగా అప్పట్లో చైనా తన వీటో అధికారం ఉపయోగించి అడ్డుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అమెరికా శాశ్వత సభ్యత్వం కోసం ప్రపోజల్ తీసుకురాగా ఏం జరుగుతుందో వేచిచూడాల్సి ఉంది.
ఇదిలాఉండగా, భారత విదేశాంగ మంత్రి జై శంకర్ కూడా యూఎన్‌లో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version