క్ష‌మాప‌ణ‌లు చెప్పి మ‌ళ్లీ తెస్తారా : సాగు చ‌ట్టాల‌పై మంత్రి కేటీఆర్

-

ర‌ద్దు చేసిన మూడు సాగు చ‌ట్టాల‌ను మ‌ళ్లీ తీసుకువ‌స్తామ‌ని కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్య‌లపై ప‌లువ‌రు రాజ‌కీయ నాయ‌కులు కౌంటర్లు వేస్తున్నారు. తాజా గా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా కేంద్ర మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుప‌ట్టారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా కేంద్ర మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ ను ప్ర‌శ్నించారు. సాగు చ‌ట్టాలు తీసుకువ‌చ్చి రైతుల‌ను ఇబ్బంది పెట్టామ‌ని సాక్ష‌త్తు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ చెప్పార‌ని అన్నారు. క్ష‌మాప‌ణ‌లు చెప్పి ర‌ద్దు చేసిన చ‌ట్టాల‌ను తిరిగి మ‌ళ్లీ తీసుకు వ‌స్తారా.. అని కేంద్ర మంత్రిని ప్ర‌శ్నించారు.

అయితే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ సాగు చ‌ట్టాల పై చేసిన ప్ర‌క‌ట‌న ఎన్నిక‌ల స్టంటేనా అని ప్ర‌శ్నించారు. అలాగే ప్ర‌ధాని ర‌ద్దు చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించ‌డం.. కేంద్ర మంత్రి ఆ చట్టాల‌ను తిరిగి తీసుకు వ‌స్తామ‌ని ప్ర‌క‌టించ‌డం అద్భుతంగా ఉంద‌ని వ్యాగ్యంగా వ్యాఖ్య‌నించారు. అలాగే బీజేపీ ప‌ట్ల దేశ ప్ర‌జ‌లు, రైతులు అప్ర‌మ‌త్తం గా ఉండాల‌ని అన్నారు. సాగు చ‌ట్టాల‌పై బీజేపీ కొత్త డ్రామా ఆడుతుంద‌ని మండి ప‌డ్డారు. ఇలా ప్ర‌క‌ట‌న‌లు చేడ‌యంతో బీజేపీ పూర్తిగా రైతు వ్య‌తిరేక ప్ర‌భుత్వంగా మారింద‌ని విమ‌ర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version