చలి బాబోయ్…. తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలెర్ట్…

తెలుగు రాష్ట్రాలను చలి చంపెస్తోంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో .. తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఉత్తర, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు చలిగాలులు వీస్తున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతోంది. వచ్చే నాలుగు రోజులు మరింత ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణ శాఖ హెచ్చిరించింది. హైదరాబాద్లో దశాబ్ధంలో డిసెంబర్ లో అత్యంత చలి రోజు నమోదైంది. సెంట్రల్ యూనివర్సిటీలో నిన్న 8.2 డిగ్రీలు, పటాన్ చెరులో 8.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత కారణంగా వ్రుద్దులు, చిన్నారులను జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇదిలా ఉంటే తెలంగాణలో అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలను 20 డిగ్రీల కన్నా తక్కువగానే నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలలు నమోదవుతున్నాయి. ఏపీలోని విశాఖ మన్యం చలికి వణుకుతోంది. చింతపల్లిలో అత్యల్పంగా 5.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.