తాను అధికారంలోకి వస్తే ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు ప్రకటించిన హామీపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తాజాగా జగన్ మద్యపాన నిషేధం పై ఓ ట్వీట్స్ సందించారు.
సంపూర్ణ మద్యపాన నిషేధం అనగా.. మద్యం ఆదాయం రూ.9 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్లకు పెంచుట అంటూ నాదెండ్ల మనోహర్ సెటైరికల్ కామెంట్ చేశారు. రాబడి చూపించి రూ .8 వేల కోట్ల బాండ్లు బజారులో అమ్మట అంటూ ఆయన ఇంకో వ్యంగ్యాస్త్రం సంధించారు. చివరగా ఇది ‘స్పిరిటెడ్ విజనరీ’ అంటూ జగన్ ను దెప్పిపొడిచారు. మేనిఫెస్టో అమలుతో జగన్ జాక్ పాట్ కొట్టారు అని కూడా నాదెండ్ల వ్యాఖ్యానించారు.
సంపూర్ణ మద్యపాన నిషేధం అనగా మద్యం ఆదాయం రూ.9 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్లకు పెంచుట !! ఆ రాబడి చూపించి రూ.8 వేల కోట్ల బాండ్లు బజార్లో అమ్ముట ! ఇదీ ‘స్పిరిటెడ్ విజనరీ’ @ysjagan గారి మేనిఫెస్టో అమలు.JACKPOT ! 😊#SpiritedVisionary_Jagan pic.twitter.com/SxKIPVlRfP
— Manohar Nadendla (@mnadendla) June 11, 2022