మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను గుర్తుచేస్తూ, వాటిని సెలబ్రేట్ చేయడానికి మహిళల విజయాలు సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా అది ప్రభుత్వం ప్రకటించిన సెలవు.. అసలు ఈ రోజు ఎలా వచ్చింది.. ఎందుకు మార్చి 8నే జరుపుకుంటారు అనే విషయాలను గురించి ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం..
ఐక్యరాజ్య సమితి 1975, 1977లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించింది. సంబరాలు జరుపుకోవడం ప్రారంభమవగానే మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మహిళలంతా శాంతియుతంగా జీవించేందుకు చర్యలు తీసుకోవడానికి ఐక్యరాజ్య సమితి కట్టుబడి ఉందని ప్రకటించింది. ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడంతోపాటు ఒక కొత్త థీమ్ ను కూడా ప్రవేశపెడుతుంది. మహిళలు సాధించిన విజయాల గురించి మాట్లాడటమే కాకుండా, లింగ ఆధారిత భేదాలు, సమానత్వం లక్ష్యం, మహిళల హక్కులు మొదలైనవాటి గురించి కూడా అవగాహన కల్పిస్తారు. ఈ సంవత్సరం థీమ్ ‘బుక్స్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ’.సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాల్లో స్త్రీ, పురుషులు సమానమేననే భావనను ప్రచారం చేస్తున్నారు.
మహిళా దినోత్సవం రోజున, మీ తల్లి, మీతో పుట్టిన సోదరీమణులు మరియు మీ తోటి ఉద్యోగుల్లో ఉన్న మహిళలను అభినందించడం మరిచిపోవద్దు.. ఇకపోతే మనదేశంలో ఈరోజును మహిళా దినోత్సవంగా జరుపుకుంటే వేరే దేశాలలో అయితే న్యూయార్క్ నగరంలో అమెరికన్ సోషలిస్ట్ పార్టీ జాతీయ మహిళా దినోత్సవాన్ని 1909 ఫిబ్రవరి 28న జరుపుకుంది. కార్మిక కార్యకర్త థెరిసా మల్కెయిల్ ఆ రోజును ప్రతిపాదించారు. నగరంలోని రెడీమేడ్ గార్మెంట్స్ కార్మికులపై జరుగుతున్న అణచివేతను ఖండిస్తూ ప్రతి ఏడాది దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అప్పుడు వారంతా ఒక తేదీ మాత్రం అనుకోలేదు.. ఏది ఏమైనా ప్రతిరోజు కుటుంబం కోసం కష్టపడే వాళ్ళ కోసం కాస్త అభిమానాన్ని, నేనున్నా అనే భరోసాను ఇవ్వండి.. గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు..Happy women’s day..