వైఎస్ఆర్సిపి పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. కేంద్ర బడ్జెట్ పై వైసీపీ నాయకులు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఓవైపు మంత్రి బుగ్గన ఈ బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని అంటుండగా, మరోవైపు మంత్రి మిథున్ రెడ్డి నిరాశాజనకంగా ఉందని అంటున్నారని చెప్పారు. పైగా ప్రీ బడ్జెట్ సమావేశాలలో తాము చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకొని కేంద్ర బడ్జెట్ తయారు చేశారంటూ వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
రైతులు, మహిళలకు చేయూత పథకాల కేటాయింపు కొంత వెనుకబాటు తలం వైసీపీ నాయకులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 32 మంది ఎంపీలు ఉండి వెనుకబడిన ఉత్తరాంధ్ర, రొయ్యల సీమ ప్రాంతాలకు నిధుల కేటాయింపు జరగకపోతే ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. జిఎస్డిపి లో 11.43% వృద్ధిరేటుతో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందంటూ దొంగ లెక్కలు చెబుతూ సీఎం జగన్ నవ్వుల పాలు అయ్యారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా వాస్తవాలను చర్చించే దమ్ముంటే ముందుకు రావాలని సవాల్ విసిరారు.