యశోద చిత్రం ఓటిటి రిలీజ్ డేట్ లాక్..!!

-

సమంత మెయిన్ పాత్రలో నటించిన చిత్రం యశోద. ఈ సినిమాని హరి హరీష్ దర్శకత్వం వహించారు. సరోగసి కాన్సెప్ట్ తో ఈ సినిమా కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ రిఫర్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకులు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై మిశ్రమ స్పందనను లభించింది. సమంత వల్లే ఈ సినిమాకి మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక కలెక్షన్ల పరంగా మంచి లాభాలను తెచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రిలీజ్ అయిన నెల రోజులు పూర్తికాకుండానే యశోద సినిమా ఓటీటి లో విడుదలవుతోంది.

డిసెంబర్ 9వ తేదీన అన్ని భాషలలో పాటు హిందీ వర్షన్ లో కూడా ఈ చిత్రం విడుదల కాబోతున్నట్లు అమెజాన్ ప్రైమ్ నుంచి అధికారికంగా ప్రకటన వెలుబడింది. ఈ సినిమా చూసిన చాలామంది ఆడియన్స్ ఇది ఓటీటి రిలీజ్ కంటెంట్ అయినప్పటికీ కూడా నిర్మాతలు పట్టుబడి మరి థియేటర్లలో విడుదల చేశారు. యశోద సినిమా థియేటర్లలో యావరేజ్ టాక్ తెచ్చుకోగా.. ఓటీటి లో మాత్రం హిట్టు కొడుతుందని సమంత అభిమానులు భావిస్తూ ఉన్నారు. ఈ చిత్రం డిసెంబర్ 9న అమెజాన్ ప్రైమ్ లో విడుదలకాబోతోంది.

సమంత నటనకు ఆమె అభిమానులే కాకుండా సినీ ప్రేక్షకులు, సిని ప్రముఖులు సైతం ఫిదా అయ్యారు. ముఖ్యంగా సమంత యాక్షన్ ఎపిసోడ్ అదరగొట్టేసిందని వార్తలు కూడా వినిపించాయి. మరొకసారి ఇప్పుడు యశోద సినిమాతో తన సత్తా పాన్ ఇండియా వైడ్ గా చాటింది అనే వార్తల కూడా వినిపిస్తున్నాయి. గతంలో పుష్ప సినిమాలోని ఒక స్పెషల్ సాంగ్లో నటించడంతోపాటు, ఫ్యామిలీ మ్యాన్ -2 వంటి చిత్రాలతో బాగా అలరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version