గుడివాడ వివాదంలో అనేక మలుపులు ఉన్నాయి. అవి వెలుగు చూసేటప్పటికీ తగాదా ఎక్కడికో చేరుకోనుంది.ముఖ్యమంత్రి జగన్ నష్ట నివారణ చర్యలు చేపట్టలేకపోతున్నారు.నూజివీడు డీఎస్పీ ఏం చెప్పనున్నారో కూడా ఆసక్తిదాయకంగానే ఉంది.అధికార పార్టీకి కొమ్ముకాసేలా ఇప్పటికే పోలీసులు ఉన్నారన్న వాదనకు బలం చేకూర్చేలానే సీఐ గోవింద రాజు ప్రవర్తన ఉందని వార్తలు అందుతున్నాయి.
అదేవిధంగా మీడియా ఎదుట కూడా ఆయన ప్రవర్తన, విలేకరులను బెదిరిస్తున్న తీరు కూడా వివాదాస్పదం అవుతోంది.క్యాసినో విషయమై జగన్ కూడా ఓ స్పష్టమయిన ప్రకటన చేసి బాధ్యులను అరెస్టు చేయిస్తామని ఎందుకనో చెప్పలేకపోతున్నారు.కేవలం చంద్రబాబును తిడుతున్నారన్న నెపంతోనేనా కొడాలి నానిని సీఎం వెనకేసుకువస్తున్నారు? అన్న సందేహం కూడా ఇప్పుడు టీడీపీ నుంచి బలీయంగా వినిపిస్తోంది.
క్యాసినో వ్యవహారం ఇప్పట్లో తేలేలా లేదు. ఈ ఎపిసోడ్ ఇప్పటిది కాదు గత ఏడాది కూడా జరిగిందని కానీ గుడివాడలో కాకుండా మరో చోట జరిగిందని ఆరోపణలు కూడా వస్తున్నాయి. అస్సలు ఆంధ్రా కల్చర్ కు సంబంధం లేని ఈ క్యాసినోలు కారణంగా వందల కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి కొడాలి నాని తప్పు చేశారో ఒప్పు చేశారో కానీ ఆయన నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి అని సొంత పార్టీ నేతలే హితవు చెబుతున్నారు.
టీడీపీతరఫున వెళ్లిన నిజ నిర్థారణ కమిటీని అడ్డుకుని, వారి వాహనాలపై దాడులు చేయడం కూడా మంచిది కాదని,ఇటువంటి చర్యల కారణంగా పార్టీ పరువు పోతుందన్న వాదన కూడా వినిపిస్తోంది.
ఒంగోలు ఎపిసోడ్ నుంచి కాస్తో కూస్తో లోకానికి తెలిసిన పేరు, లోకం తెలుసుకున్న పేరు సుబ్బారావు గుప్తా. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఈయన. మొన్నటి వేళ వైసీపీ నాయకులు బూతు పదాల వినియోగం నోరెత్తి తరువాత అదే మంత్రి అనుచరుడు సుభానీ చేతిలో దెబ్బలు తిన్న ఆర్య వైశ్య సంఘం నేత. తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన సైలెంట్ అయిపోయారు.
కొద్ది కాలం తరువాత ఆయన మీడియా ముందుకు వచ్చి కొడాలి నాని కారణంగా పార్టీ దారుణంగా దెబ్బతింటుందని పేర్కొంటూ ఫైర్ అయ్యారు. జగన్ కారణంగా పార్టీకి నాలుగు శాతం ఓట్లు వస్తే, కొడాలి నాని కారణంగా నలభై శాతం ఓట్లు పోతున్నాయని మండిపడ్డారు. నాని వెనక్కు తగ్గకుండే వైసీపీ కార్యకర్తలే తోడేళ్ల తరహా దాడి చేస్తారని హెచ్చరించారు. ఆ వివరం ఈ వీడియోలో….