డైలాగ్ ఆఫ్ ద డే : యోగి అంటే ఫ్ల‌వ‌ర్ అనుకుంటివా ఫైరు..!

-

‘ఏయ్ బిడ్డా… యే మేరా అడ్డా’ అంటున్నాడు యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్. విపక్షాలు ఎన్ని కూటములు కట్టినా… ఎంత మంది మంత్రులను బీజేపీ నుంచి ఎస్పీలోకి రాగినా యోగీ ప్రభంజనం ముందు తట్టుకోలేకపోయారు.  దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల ఎన్నికలపై ముఖ్యంగా యూపీ ఎన్నికలపై అన్ని ప్రధాన పార్టీలతో పాటు… ప్రజలు కూడా ఎంతో ఆసక్తి కనబరిచారు. యూపీలో గెలిస్తే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు సులభం అవుతుందని అన్ని పార్టీలు భావించాయి. అయితే ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా… యూపీని ఒడిసిపట్టాడు యోగీ ఆదిత్యనాథ్.

ఎన్నికల ముందు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ అనేక చిన్న పార్టీలను కులపుకుని పోటీచేశారు. ముఖ్యంగా యోగీ క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్న పలువురు ఓబీసీ మంత్రులు ముఖ్యంగా.. స్వామీ ప్రసాద్ మౌర్య వంటి వారు బీజేపీని వదిలి సమాజ్ వాదీ పార్టీలో చేారారు. ఇప్పుడు ఆయన కూడా బీజేపీ ధాటికి ఓటమి అంచుల్లో ఉన్నారు. ఆయనతో పాటు వెళ్లిన నేతలు బీజేపీ ప్రభంజనానికి తట్టుకోలేకపోయారు. బీజేపీకి మంత్రులు రాజీనామా చేస్తున్న సయమంలో ఎన్సీపీ, కాంగ్రెస్, త్రుణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు, ఆపార్టీల నేతలు బీజేపీ పని అయిపోయిందని అంటూ పలు వ్యాఖ్యలు చేశారు.

అసలు యోగీ అంటే ఫ్లవర్ అనుకున్నారు… కానీ ఫైర్ అని తెలియ లేదు వాళ్లకు. యోగీ అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని ఇప్పుడు తెలుస్తోంది విపక్షాలకు. చివరకు త్రుణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా అఖిలేష్ యాదవ్ కు సపోర్ట్ గా ప్రచారం చేసినా.. యోగీ ముందు వారి ఆటలు సాగలేదు. 403 సీట్లలో 269 సీట్లను కైవసం చేసుకునే దిశలో వెళ్తోంది.

yogi-adityanath

ఎన్ని వ్యతిరేఖతలు వచ్చినా.. యూపీలో శాంతిభద్రతలతో పాటు డెవలప్మెంట్ లో యోగీ తన మార్క్ చూపించారు. యోగీ వచ్చిన తర్వాత యూపీ శాంతిభద్రతలు చాలా మారాయి. గతంలో ఉన్న గుండా రాజ్, మాఫియా రాజ్ లకు పూర్తిగా, సమర్థవంతంగా నిర్మూలించారు. ఆడపిల్లల రక్షణకు పెద్దపీట వేశారు. వందకు పైగా ఎన్ కౌంటర్లు చేసి శాంతి భద్రలకు అవాంతరాలు కలిగించేవారిని పైకి పార్సల్ చేశారు. దీంతో మహిళా ఓటర్లు యోగీకి సపోర్ట్ గా నిలిచారు. ఈ ప్రభావం వల్లనే రైతు ఉద్యమం ఎక్కువగా సాగిన లఖీంపూర్ ఖేరీ ప్రాంతంలో కూడా బీజేపీ తన సత్తాను చాటిందంటే.. యోగీ మార్క్ పాలన ఎలా ఉందో అర్థం అవుతోంది. ఇప్పటి వరకు యూపీలో ఏ పార్టీ వరసగా ఎన్నికల్లో గెలుపొందలేదు. కానీ యోగీ మాత్రం ఈ రికార్డ్ ను బద్ధలు కొట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version