శృంగారం గురించి వీటిని తప్పక తెలుసుకోవాలి.. లేకుంటే ప్రమాదమే..

-

శృంగారం అనేది శారీరక చర్య..అందులో ఏముందిలే మూడ్ వస్తే పని అయిపోతుంది అనుకోవడం తప్పు భావన..దీనితో ఎన్నో శారీరక, మానసిక ప్రయోజనాలు కలుగుతాయి. కానీ చాలా మందికి సెక్స్ లో ఎప్పుడు పాల్గొనాలి..ఎప్పుడు పాల్గొనకూడదో తెలియదు. దీనివల్లే లేనిపోని సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు..రతిక్రీడ అనేది మానవ జీవితంలో ఒక ఆరోగ్యకరమైన అంశం. అందుకే దీనిపై అందరికీ తగినంత అవగాహన ఉండాలి. అందుకే సెక్స్ ఎడ్యుకేషన్ ఆవశ్యకతను ఆరోగ్య నిపుణులు నొక్కి చెబుతుంటారు. సెక్స్ విషయానికొస్తే చేయవలసినవి, చేయకూడనివి చాలానే ఉన్నాయి.

ఈ నియమాలను పాటిస్తే మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. లేదంటే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు సెక్స్ విషయంలో చాలా మందికి తెలియని విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు సాధారణంగా మహిళలకే ఎక్కువగా వస్తాయి. అయితే మీకు ఈ మధ్యకాలంలో ఈ ఇన్ఫెక్షన్ సోకి దాని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకున్నట్టైతే.. మీరు మరిన్ని రోజులు సెక్స్ కు దూరంగా ఉండాల్సి వస్తుంది. మీకు ఇన్ఫెక్షన్ లేదని అనిపించినా.. మీ శరీరంలో వ్యాధికారక అవశేషాలు ఉండొచ్చు, ఇవి మీ భాగస్వామికి సోకుతాయి. అందుకే యూటీఐ నుంచి కోలుకున్న వెంటనే సెక్స్ లో పాల్గొనకూడదు..

ప్రెగ్నెన్సీ టైంలో కూడా సెక్స్ లో పాల్గొనొచ్చు. దీనిలో వైద్యపరంగా కూడా తప్పు లేదు. అందుకే చాలా మంది జంటలు ప్రెగ్నెన్సీలో కూడా సెక్స్ లో పాల్గొంటారు. అయినప్పటికీ గర్భాశయం, మావి, లైంగిక సంక్రమణ వ్యాధుల చరిత్ర వంటి అనేక అంశాలు పిండానికి ప్రమాదాన్ని కలిగిస్తాయి. అందుకే ప్రెగ్నెన్సీ టైంలో సెక్స్ లో పాల్గొనాలనుకుంటే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది..ఇకపోతే చివరిగా కండోమ్ వంటి మంచి రక్షణ లేకపోతే శృంగారంలో పాల్గొనకండి. ఎందుకంటే ఈ కండోమ్లు అవాంఛిత గర్భం నుంచి మిమ్మల్ని రక్షించడమే కాకుండా అసురక్షిత సెక్స్ వల్ల కలిగే లైంగిక సంక్రమణ వ్యాధుల నుంచి కాపాడుతుంది
..

Read more RELATED
Recommended to you

Exit mobile version