పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని లైంగిక వేధింపులకు మోసం చేసిన ఓ ఉన్మాది ఉదాంతం లక్నోలో వెలుగు చూసింది. లక్నోలోని పీడబ్ల్యూడీ ఇంజనీర్ ఇందిరా నగర ప్రాంతంలో నివసిస్తోంది బాధితురాలు. అయితే 5 సంవత్సరాల క్రితం పీడబ్ల్యూడీ కార్యాలయంలో ఓ టెండర్‌కు సంబంధించి బాధిత యువతికి, ప్రసాద్ విజయ్‌కు మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా సన్నిహితంగా మారింది. దీంతో తాను షూటింగ్‌లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నానని నేషనల్ లెవెల్ షూటర్‌ను అంటూ చెప్పుకుంటూ పెండ్లి పేరుతో లైంగిక దాడికి పాల్పడ్డాడు.
గోమతినగర్‌లోని మహిళ అపార్ట్‌మెంట్‌లో పలుమార్లు ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశాడు. అయితే తనను పెళ్లి పెండ్లి చేసుకోవాలని బాధిత యువతి అడగడంతో.. పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తే చంపేస్తానని బెదిరించినట్లు మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధిత యువతి పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని హనుమాన్ ఆలయం వద్ద అరెస్ట్ చేశారు. తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశామని డీసీపీ నార్త్‌జోన్ ఎస్ చిన్నప్ప పేర్కొన్నారు.