ఇప్పటివరకు పాలనపై దృష్టి పెట్టి ప్రజలకు అండగా నిలిచిన ఇకపై పార్టీపై ఫోకస్ చేయనున్నారు. అధికారంలోకి వచ్చాక జగన్ కు పార్టీపై పెద్దగా ఫోకస్ చేయలేదు..ప్రభుత్వాన్ని నడిపించే పనిలో పడి పార్టీ వైపౌ దృష్టి పెట్టలేదు. దీంతో పార్టీలో కొంత ఇబ్బందికర పరిస్తితులు తలెత్తాయి…కార్యకర్తలు అసంతృప్తిగా ఉండటం..ఎక్కడకక్కడ నేతల మధ్య ఆధిపత్య పోరు జరగడం లాంటివి మొదలయ్యాయి. దీని వల్ల పార్టీకి డ్యామేజ్ పెరిగే అవకాశాలు పెరిగాయి.
అయితే అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటింది…పైగా నెక్స్ట్ ఎన్నికలపై ఫోకస్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే జగన్ ఇంకా పార్టీపై దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడానికి ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపర్చుకోవాలని పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. సరిగ్గా పనిచేయకపోతే టికెట్ కూడా ఇవ్వనని చెప్పేస్తున్నారు. ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్న జగన్…తాజాగా సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులకు క్లాస్ తీసుకున్నారు.
ఎమ్మెల్యేలతో పాటు వీరు కూడా ఎఫెక్టివ్ పనిచేయాలని, ఒకవేళ ఎవరైనా పనిచేయలేకపోతున్నాం అనుకుంటే తప్పుకోవచ్చని చెప్పేశారు. అలాగే తమకు కేటాయించిన జిల్లాల్లో 10 రోజుల పాటు తిరిగి…ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేస్తున్నారా? లేదా? అనేది చూడాలని, అలాగే పార్టీని బలోపేతం చేయడం కోసం కృషి చేయాలని చెప్పారు. ఇక అక్టోబర్ లోగా జిల్లా కమిటీలు, అనుబంధ విభాగాలు, నియోజకవర్గ, మండల, గ్రామ, బూత్ స్థాయి కమిటీలని నియమించాలని సమన్వయకర్తలకు, అధ్యక్షులని ఆదేశించారు.
అంటే ఇకపై పార్టీపైనే దృష్టి పెట్టి…బలోపేతం చేసి…మళ్ళీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడమే లక్ష్యంగా జగన్ ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసేశారు. మరి ఎన్నికల నాటికి జగన్ ఇంకా దూకుడుగా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి.