త్వరలోనే కేసీఆర్ పాలన కు గోరి కడతాం – వైయస్ షర్మిల

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై వైయస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. పగలనక, రాత్రనక.. ఎండనక, వాననక.. విద్యార్థులు ధర్నా చేస్తుంటే ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందా? పిల్లల ప్రాణాలంటే లెక్కలేదా? వైయస్ఆర్ స్థాపించిన క్యాంపస్ పై ఎందుకంత నిర్లక్ష్యం? అని ప్రశ్నించారు.

నిన్న రైతులు, ఇయ్యాల విద్యార్థులు.. రేపు యావత్ తెలంగాణ ఏకమై నీ నియంత పాలనకు గోరి కడుతుందని హెచ్చరించారు షర్మిల. జనం ఎట్ల బతుకుతున్నారో పాలకులు ఆలోచన చేయడం లేదు. కరెంట్, RTC, గ్యాస్, పెట్రోల్, రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగి, రోజూ పనిచేస్తేనే పూట గడిచే పరిస్థితి అని నిప్పులు చెరిగారు. KCR ​ఇంగ్లీష్ మీడియం పేరుతో 3500 స్కూళ్లు బంద్ పెట్టిండు. బడుల్లో బుక్కులు లేవు.

యూనిఫాం లేదని ఓ రేంజ్ లో చెలరేగారు. ప్రైవేటుకు పంపిద్దామంటే లక్షల్లో ఫీజులు. బంగారు తెలంగాణలో సదువు కూడా భారమైందని ఆవేదన వ్యక్తం చేశారు.డిగ్రీలు,PGలు చేసిన బిడ్డలు రోడ్ల మీద తిరగాలి. ఐదారు చదివినోళ్లు మంత్రులు, MLAలు కావాలి. పేపర్లలో సొంత ప్రచారానికి 400కోట్లు ఉంటయ్ కానీ రుణమాఫీకి, ఆరోగ్యశ్రీకి, ఫీజు రీయింబర్స్ మెంట్​కు పైసలుండవని చెప్పారు

Read more RELATED
Recommended to you

Exit mobile version