వైఎస్ వివేకా కేసు : కీలకంగా మారిన డ్రైవర్ దస్తగిరి సాక్ష్యం

-

కడప జిల్లా : మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దూకుడు పెంచింది సిబిఐ. వివేకానంద రెడ్డి హత్య కేసులో మాజీ డ్రైవర్ దస్తగిరి వద్ద సి ఆర్ పిసి 164 క్రింద వాంగ్మూలం రికార్డు చేయనుంది సి బి ఐ. దస్తగిరి వద్ద వాంగ్మూలం నమోదు చేయడం కోసం జమ్మలమడుగు కోర్టులో నేడు హాజరుపెట్టే అవకాశం ఉంది. మాజీ డ్రైవర్ దస్తగిరి వద్ద నుంచి సీబీఐ కీలక సమాచారం రాబట్టి నట్లు సమాచారం అందుతోంది.

దస్తగిరి ఇంట్లో తనిఖీ చేసిన సిబిఐ… పలు ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. గత పది రోజులుగా దస్తగిరి తో పాటు అతని కుటుంబ సభ్యులను విచారించిన సీబీఐ… నేడు లేదా ఎల్లుండి మరి కొంత మందిని కోర్టులో హాజరు పెట్టనుంది. ఇప్పటికే వివేక ఇంటి వాచ్ మెన్ రంగయ్య వద్ద జమ్మల మడుగు కోర్టులో సి ఆర్ పిసి 164 కింద వాంగ్మూలం నమోదు చేసింది సిబిఐ. కాగా.. ఇటీవలే ఈ కేసులో ఎలాంటి సమాచారమైన చెప్పిన వారికి రూ. 5 లక్షల రివార్డును సీబీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version