వైసీపీ పార్టీలో కరోనా కలకలం… తాజాగా కరోనా బారిన పడ్డ ఇద్దరు ఎంపీలు

-

కరోనా రాజకీయ పార్టీల్లో కలకలం రేపుతోంది. ఇప్పటికే దేశంలోని పలు రాజకీయ పార్టీల ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా వైసీసీ ఎంపీలు ఇద్దరు కరోనా బారినపడ్డారు. కాకినాడ ఎపీ వంగా గీతా విశ్వనాథ్ తో పాటు ఆమె గన్ మెన్, పీఏకు కూడా కరోనా సోకింది. మరోవైపు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కు కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే వైసీపీలో మంత్రి కోడాలి నాని తో పాటు ఎమ్మెల్యే అంబటి రాంబాబులకు కరోనా పాజిటివ్ గా తేలింది.. వీరిద్దరు ప్రస్తుతం కోలుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ లకు కరోనా సోకింది. ప్రస్తుతం వీరిద్దరు కరోనా నుంచి  కోలుకున్నారు.

ఈనెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో అన్ని పార్టీలు కరోనా పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ప్రజా ప్రతినిధులకు ఏచిన్న లక్షణాలు ఉన్నా.. కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. ఇటు తెలంగాణలో కూడా కొంతమంది ప్రజా ప్రతినిధులకు కరోనా సోకింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డిలకు కరోనా పాజిటివ్ గా తేలింది.

Read more RELATED
Recommended to you

Latest news