చైనా మొబైల్ కంపెనీ.. ZTE కిరియన్ రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. బ్లేడ్ సిరీస్‌లో భాగంగా.. ZTE Blade A72, ZTE Blade A52 అనే పేర్లతో కంపెనీ గ్లోబల్‌గా ఈ ఫోన్లను విడుదల చేసింది. అయితే ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు దాదాపు శాంసంగ్ ఫోన్‌లో ఉన్నట్లుగానే ఉన్నాయి. ఈ బ్లేడ్ సిరీస్ ఫోన్ కాస్ట్, ఫీచర్స్ ఏంటో మీరు చూడండి.!
ZTE Blade A72 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్..
90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే అందించారు.
3 GB ర్యామ్, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో.. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ Unisoc SC9863A ప్రాసెసర్పై ఈ ఫోన్ పనిచేయనుంది.
వెనుకవైపు 13+2+2 ట్రిపుల్ డిజికామ్ సెటప్, ముందువైపు 5 MP కెమెరా అందించారు.
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఈ ఫోన్ 6000 mAh బ్యాటరీ సామర్థ్యం ఉంది.
దీని ధర, సుమారు రూ. 9,000/- గా కంపెనీ నిర్ణయించింది.
ZTE Blade A52 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్..
60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.51 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే అందించారు.
2 GB ర్యామ్, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ Unisoc SC9863A ప్రాసెసర్పై ఈ ఫోన్ పనిచేయనుంది.
వెనుకవైపు 13+2+2 ట్రిపుల్ డిజికామ్ సెటప్, ముందువైపు 5 MP సెల్ఫీ షూటర్
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఇది పనిచేయనుంది.
5000 mAh బ్యాటరీ సామర్థ్యం ఉంది.
దీని ధర, సుమారు రూ. 7,000/-గా ఉంది.
ప్రస్తుతం ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లను మలేషియాలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి.. అయితే.. ఇవి ఇండియన్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయనేది కంపెనీ ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే భారత్‌లోకి కూడా రావొచ్చని టెక్ నిపుణులు అంచనా.! చూడాలి మరీ.. ఎప్పుడు ఇవి ఇండియాలోకి ఎంట్రీ ఇస్తాయో.!