లాప్టాప్ ని తీసుకోవాలా..? అయితే రియల్ మీ బుక్ ప్రైమ్ రివ్యూ చూడండి..!

-

మంచి లాప్టాప్ ని తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే రియల్ మీ బుక్ ప్రైమ్ ని చూడండి. ఈ ల్యాప్‌టాప్‌ను ఏప్రిల్ 7న ఇండియాలో విడుదల చేయనున్నారు. అయితే మరి ఇక ఈ లాప్టాప్ ధర, ఫీచర్స్ మొదలైన వివరాలను కూడా చూద్దాం. ఈ రియల్ మీ బుక్ ప్రైమ్ 16GB వరకు RAMని ఆఫర్ చేస్తోంది.

 

11వ తరం ఇంటెల్ ప్రాసెసర్, 2.8K డిస్‌ప్లే ని కలిగి ఈ లాప్టాప్ వుంది. అలానే 3:2 నిష్పత్తితో 14-అంగుళాల LCD స్క్రీన్‌ను కలిగి ఉందిది. ఇక దీని యొక్క పని తీరు ఎలా వుంది అనేది చూస్తే.. రియల్‌మే బుక్ (స్లిమ్) లాగే ఈ లాప్టాప్ కూడా పని చేయనుంది. ఈ లాప్టాప్ 2160 x 1440 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌ను కలిగి వుంది. ఇది Intel Xe iGPUతో జత చేయబడిన 11వ తరం Intel Core i5 CPU ద్వారా అందించబడుతుంది.

ఇది ఇలా ఉంటే USB-C 3.2 Gen 2 పోర్ట్, USB-A 3.1 Gen 1 పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ స్లాట్, Wi-Fi 6 మరియు బ్లూటూత్ 5.2 ఫీచర్లను ఇది కలిగి వుంది. స్కీమాటిక్స్‌ను కూడా పంచుకుంది, ఇది ల్యాప్‌టాప్ డ్యూయల్-ఫ్యాన్ డిజైన్‌ను కలిగి వుంది. 16GB LPDDR4 RAM, 512GB PCIe SSD స్టోరేజ్ 54Wh బ్యాటరీ ఈ లాప్టాప్ కి వుంది.

Windows 11 OSతో ముందే ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. అలానే ఇది డ్యూయల్-ఫ్యాన్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఎక్కువ వర్క్ చేసిన హీట్ ఎక్కకుండా ఉంటుంది. నాలుగు వైపులా సన్నని బెజెల్స్‌తో పాటు 60Hz రిఫ్రెష్ రేట్‌తో 2K డిస్‌ప్లేను రియల్ మీ బుక్ ప్రైమ్ కలిగి వుంది. దీని యొక్క బరువు 1.37KG, ఇది చాలా తేలికైన లాప్టాప్. 14.9 మిమీ మందాన్ని కలిగి ఉంది. Intel కోర్-i5 ప్రాసెసర్, 8GB RAM మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంటే ధర రూ. 59,999. అదే 16GB RAMతో అయితే ధర సుమారు రూ. 65,000 గా ఉండనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news