లాంచ్‌కు ముందే లీకైన OnePlus Nord CE 3 స్పెసిఫికేషన్స్…!!

-

వన్‌ప్లస్‌ నుంచి.. కొత్త ఫోన్‌ చైనాలో లాంచ్‌ అయింది.. అదే OnePlus 11. ఇది వచ్చే నెల ఇండియాలో లాంచ్‌ కానుంది. ఫ్లాగ్షిప్స్ తో పాటు ఈ బ్రాండ్ కొన్ని మిడ్-రేంజ్ ఫోన్లపై కూడా పని చేస్తోంది. OnePlus Nord CE 3 ఇందులో ఒకటి. ఇటీవలి కాలంలో ఈ ఫోన్‌పై కొన్ని వార్తలు వచ్చాయి.. 91మొబైల్స్ ఎక్స్‌క్లూజివ్‌గా హై-క్వాలిటీ రెండర్స్‌ని పబ్లిష్ చేసింది. లీకుల ఆధారంగా స్పెసిఫికేషన్స్‌ ఎలా ఉన్నాయో చూద్దామా…

OnePlus Nord CE 3 స్పెసిఫికేషన్స్..(అంచనా)

6.7-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంది..
క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్‌తో ఈ ఫోన్‌ రాబోతుంది.
120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది.
 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, హెచ్డీఆర్10, హెచ్ఎల్‌జీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 695 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 619 జీపీయూ వాడారు.
8జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి.
ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.
OnePlus Nord CE 3 స్మార్ట్ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 5జీ, 4జీ వొల్టీ, డ్యూయల్ సిమ్, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉంటాయి.
గతంలో లీకైన వార్తలను బట్టి, OnePlus Nord CE 3 స్మార్ట్ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోందని తెలిసింది. అయితే ఈ ఫోన్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తోన్న విషయాన్ని గమనించాలి. లాంచ్ తర్వాత యూజర్లు ఈ ఫోన్ ని ఏమేరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version