చైనాలో లాంచ్‌ అయిన Nubia Z40s pro స్మార్ట్ ఫోన్‌

-

Nubia Z40s pro స్మార్ట్ ఫోన్‌ చైనాలో లాంచ్‌ అయింది. గతంలోనే దీని ముందు వర్షన్‌ నుబియా జెడ్‌ 40 ప్రో లాంచ్‌ అయింది. దీని తర్వాతి వర్షన్‌గా ఈ ఫోన్‌న లాంచ్‌ చేశారు. ఈ ఫోన్‌ ధర, స్పెసిఫికెషన్స్‌ వివరాలు ఇలా ఉన్నాయి..
నుబియా జెడ్40ఎస్ ప్రో ధర..
ఈ ఫోన్ ధర 3,399 యువాన్ల నుంచి (సుమారు రూ.40,000) ప్రారంభం కానుంది.
మ్యాజిక్ గ్రీన్, నైట్ సీ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
నుబియా జెడ్40ఎస్ ప్రో స్పెసిఫికేషన్లు..
ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 480 హెర్ట్జ్‌గానూ ఉంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
18 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 80W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
120W ఫాస్ట్ చార్జింగ్ ఉన్న వేరియంట్లో 4600 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత మైఓఎస్ 12 స్కిన్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
దీని మందం 0.8 సెంటీమీటర్లు కాగా, బరువు 205 గ్రాములుగా ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే… 
ఈ ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 64 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్787 ప్రాసెసర్‌ను అందించారు. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 8 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియోకాల్స్‌ కోసం.. ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.
మనదేశంలో నుబియా జెడ్40ఎస్ ప్రో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు. ఇవే ఫీచర్స్‌తో మనదేశంలో ఈ ఫోన్‌ లాంచ్‌ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో..ఈ కాస్ట్‌లో ఉన్న ఫోన్లకు పోటి ఇచ్చి నిలబడగలుగుతుందో లేదో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news