రూ.12 వేలలో Oppo A16e.. బడ్జెట్ లో బెస్ట్ ఫీచర్స్

-

ఒప్పో A16e స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్‌ప్లేను అందించారు. బడ్జెట్ లో స్మార్ట్ ఫోన్ తీసుకువోవాలి అనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక. ఇందులో ఫీచర్స్ కూడా బాగున్నాయి. ఓసారి ఈ ఫోన్ రివ్యూ చూద్దామా…!
ఒప్పో ఏ16ఈ ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,990గా ఉంది.
ఇక 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,990గా ఉంది.
ఒప్పో ఏ16ఈ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేస్తుంది..
ఇందులో 6.52 ఇంచుల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు.
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది.
డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, పిక్సెల్ డెన్సిటీ 269పీపీఐగానూ ఉంది.
4 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4230 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో ఉంది.
కామేరా ముచ్చటకు వస్తే..
ఇందులో వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, మైక్రో యూఎస్‌బీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి.
యాక్సెలరోమీటర్, మ్యాగ్నెటోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్లను ఇందులో అందించారు. దీని మందం 0.78 సెంటీమీటర్లు కాగా… బరువు 175 గ్రాములుగా ఉంది.
మొత్తానికి 12వేలల్లో ఒక మంచి ఫోన్ అంటే ఇది కూడా చూడొచ్చు. మీలో ఎవరైనా కొత్త ఫోన్ కొనలాంటే.. ఓసారి ఒప్పో పై చూపు తిప్పేయండి..!

Read more RELATED
Recommended to you

Latest news