భారీగా తగ్గిన Samsung Galaxy A32 స్మార్ట్‌ ఫోన్‌ ధర..!!

-

ప్రముఖ సౌత్‌ కొరియన్‌ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ నుంచి కొత్త ఫోన్ల రాక కొనసాగుతూనే ఉంది. కష్టమర్స్‌ను ఆకట్టుకోవడానికి కంపెనీ ఇప్పటికే పలు ఫోన్లపై ధరలను భారీగా తగ్గిస్తుంది. సామ్ సంగ్ గెలాక్సీ ఏ సిరీస్‌ లోని మరో స్మార్ట్‌ ఫోన్ ధరను భారీగా తగ్గించింది. సామ్ సంగ్ గెలాక్సీ ఏ32 స్మార్ట్‌ ఫోన్ ధరను రూ.3,500 తగ్గిస్తున్నట్లు వెల్లడించింది.

ఈ ఫోన్‌ రూ.25,000 లోపు బడ్జెట్‌లో రిలీజైంది..ఇప్పుడు ఈ స్మార్ట్‌ ఫోన్‌ను రూ.20,000 లోపే కొనే అవకాశాన్ని కల్పించింది. బ్యాంక్ ఆఫర్స్‌తో మరింత డిస్కౌంట్ పొందే వెసులు బాటు ఉంది. గతంలో సామ్ సంగ్ గెలాక్సీ ఏ32 స్మార్ట్‌ ఫోన్ 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,499 ఉండేది. ప్రస్తుతం రూ.3,500 తగ్గించడంతో ధర రూ.19,999కి తగ్గింది. అమెజాన్, ఫ్లిప్‌ కార్ట్‌లో బ్యాంక్ ఆఫర్స్‌తో ఇంకా తక్కువ ధరకే ఈ మొబైల్‌ను పొందే అవకాశం ఉంది.

సామ్ సంగ్ గెలాక్సీ ఏ32 ఫీచర్లు..
ఈ స్మార్ట్ ఫోన్ లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ యూ డిస్‌ప్లే ఉంది.
మీడియా టెక్ హీలియో జీ80 ప్రాసెసర్‌ తో రన్ అవుతుంది.
ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్ ఆండ్రాయిడ్ 11 + వన్ యూఐ 3 ఆపరేటింగ్ సిస్టమ్‌ తో రన్ అవుతుంది.
డ్యూయెల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది.

కెమెరా క్వాలిటీ..

సామ్ సంగ్ గెలాక్సీ ఏ32 స్మార్ట్‌ ఫోన్‌ లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. వెనుక వైపు 64 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 5 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ + 5 మెగా పిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో నాలుగు కెమెరాల సెటప్ ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆసమ్ బ్లాక్, ఆసమ్ బ్లూ, ఆసమ్ వయొలెట్ రంగుల్లో లభ్యం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news