ఈరోజే Poco C50 లాంచ్‌.. బడ్జెట్‌ రేంజ్‌లో బెస్ట్‌ ఆప్షన్..!!

-

పోకో నుంచి కొత్త ఫోన్‌ లాంచ్‌కు రెడీ అయింది. సీ సిరీస్‌లో భాగంగా.. పోకో సీ50 జనవరి 3న లాంచ్‌ కానుంది. పోకో సీ50 బడ్జెట్ రేంజ్‍లో 4జీ ఫోన్ అడుగుపెట్టనుంది. మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌తో ఈ ఎంట్రీ లెవెల్ ఫోన్ రానుంది. 2023లో షావోమీ సబ్ బ్రాండ్ పోకో నుంచి ఇండియాలో లాంచ్ కానున్న తొలి ఫోన్ ఇదే అవడం విశేషం. Poco C50 వివరాలు ఇలా ఉన్నాయి…

Poco C50 Price: పోకో సీ50 ధర రూ.8,000లోపు ఉండే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ఇదే రేంజ్‍లో సామ్‍‍సంగ్ గెలాక్సీ ఏ04 కూడా వస్తోంది. ఈనెల 4న లాంచ్‌ కానుంది. రెండిటి మధ్య గట్టిపోటీయే ఉండనుంది.

పోకో సీ50 లాంచ్ వివరాలు..
Poco C50 launch details: పోకో సీ50 మొబైల్ ఈరోజు మధ్యాహ్నం లాంచ్ కానుంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్‌ (Flipkart) లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.
ఫ్లిప్‍కార్ట్‌లో ఇప్పటికే ఈ ఫోన్ కోసం మైక్రోసైట్ ఏర్పాటైంది. దీని ద్వారా పోకో సీ50 డిజైన్‍తో పాటు కొన్ని స్పెసిఫికేషన్లు తెలుస్తున్నాయి.
లెదర్ లాంటి బ్యాక్ ప్యానెల్‍ను Poco C50 కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ వెనుక చతురస్రాకారంలో కెమెరా హంప్ ఉంటుంది.
ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఈ మొబైల్ బ్యాక్ ప్యానెల్‍కు ఉంది.

రెడ్‍మీ ఏ1+కు రీబ్రాండెడ్ వెర్షన్‍గా పోకో సీ50 ఉంటుందని తెలుస్తోంది.
6.5 ఇంచుల హెచ్‍డీ ప్లస్ ఎల్‍సీడీ డిస్‍ప్లేతో పోకో సీ50 రానుంది.
ఫ్రంట్ కెమెరా కోసం డిస్‍ప్లే టాప్ సెంటర్లో వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది.
మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్ ఈ స్మార్ట్ ఫోన్‍లో ఉంటుంది.
పోకో సీ50 వెనుక రెండు కెమెరాలు ఉంటాయి. దీంట్లో 8 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాగా ఉంటుంది.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్‍కు 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను పోకో పొందుపరుస్తోంది.
ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్‍ ఓఎస్‌పై రన్ అవుతుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఈ మొబైల్‍లో ఉండనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version