ఎక్స్​లో ఆ ఫీచర్లు వాడాలంటే.. ఇక నుంచి ఏడాదికి 1 డాలర్ చెల్లించాల్సిందేనట!

-

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విటర్​ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఆయన ఆ సంస్థలో మార్పులు చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. చివరకు ఆ సంస్థ పేరు ఎక్స్​గా మార్చేశారు. ఇక ఇప్పుడు మరో కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు. ఎక్స్​లో మరో సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌ను పరీక్షించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం న్యూజిలాండ్‌, ఫిలిప్పీన్స్‌లో ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్‌ పాలసీ అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ సబ్​స్క్రిప్షన్ మోడల్ ఏంటంటే..

ఈ సబ్​స్క్రిప్షన్ ప్రకారం.. కొత్తగా ఎక్స్‌ అకౌంట్ తెరిచే యూజర్లు…. ఏడాదికి 1 డాలర్‌ చెల్లించాల్సి ఉంటుందట. వెబ్‌వెర్షన్‌లో ఇతరుల సందేశాలను రీ పోస్ట్‌ చేయడం, లైక్ చేయడం, బుక్‌ మార్క్‌ చేయడం, ఇతరుల ఖాతాలను మెన్షన్‌ చేయడం వంటి బేసిక్‌ ఫీచర్లు కావాలనుకునే వారు మాత్రమే ఈ ఫీజు చెల్లించాల్సి ఉంటుందట. ఖాతా తెరిచి పోస్ట్‌లను చదవడం, ఫొటోలు, వీడియోలు చూడ్డానికి మాత్రం ఎలాంటి రుసుం అవసరం లేదట. ఇప్పటికే ఎక్స్‌ ఖాతా ఉన్నవారిపై కొత్త సబ్‌స్క్రిప్షన్‌ పాలసీ ఎలాంటి ప్రభావం చూపదని ఎక్స్ స్పష్టం చేసింది. నకిలీ ఖాతాలను అరికట్టడం కోసమే ఈ తాజా చర్యలను ఎక్స్ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version