భవిష్యత్తు లో సమస్యలు లేకుండా ఉండాలంటే.. ఈ నాలుగు ముఖ్యం..!

-

మన జీవితంలో జరిగే చాలా సమస్యలను మనం చాణక్య చెప్పిన విధంగా చేసి పరిష్కరించుకోవచ్చు. ఆచార్య చాణక్య మన జీవితంలో జరిగే వాటి గురించి ఎంతో వివరంగా చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ముందుకు వెళ్లాలని అనుకుంటారు. అందుకోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సమస్యలు వస్తాయి సమస్యలు అన్నిటిని దాటుకు వెళ్తేనే జీవితంలో ఉన్నత స్థితికి వెళ్లగలము. ఆచార చాణక్య ఈ నాలుగు రక్షించుకుంటే భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని అన్నారు. మరి ఆ నాలుగు వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

మర్యాదపూర్వకంగా నడుచుకోవడం:

ఎప్పుడూ కూడా మర్యాదపూర్వకంగా నడుచుకుంటూ ఉండాలి. ఇతరులతో మర్యాదగా ఉంటే లైఫ్ లో సురక్షితంగా ఉంటాము. మృదువుగా మధురంగా ప్రవర్తిస్తే జీవితం బాగుంటుందని ఆచార చాణక్య చాణక్య నీతి ద్వారా చెప్పారు.

డబ్బు:

డబ్బు ద్వారా మతం రక్షించబడుతుంది, జ్ఞానాన్ని యోగం ద్వారా రక్షించొచ్చు, స్వీకరించొచ్చు. సద్గుణ సంపన్నులైన స్త్రీలు కుటుంబాన్ని సమర్థవంతంగా రక్షిస్తారని చాణక్య అన్నారు.

ఇంటిని సురక్షితంగా ఉంచేవారు:

స్త్రీ ఇంటికే కాదు కుటుంబానికి కూడా వెన్నెముక. స్త్రీ తన ఇంటిని సురక్షితంగా ఉంచుకోవడానికి చూసుకోవాలని సంస్కారవంతురాలు సద్గుణ సంపన్నురాలు ఇంట్లో ఉంటే కుటుంబం బాగుంటుంది అని చాణక్య అన్నారు.

కృషి ముఖ్యం:

భవిష్యత్తు సురక్షితంగా ఉండాలంటే విద్య యోగం అంటే కృషి ఉండాలి. విద్య మనల్ని రక్షిస్తుంది. చీకటి నుండి మనల్ని విద్య దూరం చేస్తుంది అలానే మన జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లాలంటే విద్య చాలా ముఖ్యమైనది అని చాణక్య అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news