ఈ తెలుగు పాటలతో వినాయక చవితిని జరుపుకోండి

-

వినాయక చవితి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి కూడా ఒకటి. అయితే వినాయక చవితి నాడు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో వినాయక విగ్రహాన్ని పెట్టి పూజిస్తూ వుంటారు.

అలానే అందంగా అలంకరణ చేయడం. వినాయకుడికి నచ్చిన కుడుములు, ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టడం ఇలా ఎవరి పద్దతిని వాళ్ళు ఫాలో అవుతూ వుంటారు. అయితే ఇది ఇలా ఉంటే ఈ తెలుగు పాటలతో మీ వినాయక చవితిని మరెంత బాగా జరుపుకోండి.

జయ జయ శుభకర వినాయక:

గణేష్ ఉత్సవాల్లో జయ జయ శుభకర వినాయక పాపులర్ పాట. ఈ పాట దేవుళ్ళు చిత్రం లోనిది. ఈ పాట ని ప్లే చేసి వినాయక చవితి పండుగకు అందం తీసుకురండి.

దండాలయ్యా ఉండ్రాలయ్య:

వెంకటేష్, టబు నటించిన కూలి నెంబర్ వన్ సినిమాలోది ఈ పాట. దండాలయ్యా ఉండ్రాలయ్య పాట కూడా గణేష్ ఉత్సవాల్లో వింటూనే ఉంటాం.

శుక్లాంబరధరం వాతాపి గణపతి:

ఈ పాట ఎన్టీఆర్ నటించిన వినాయక చవితి సినిమా లోనిది. ఈ చిత్రంలో పాటలను గంటసాల అందించారు.

దినకర శుభకర:

ఈ పాట గంటసాల అందించారు. ఇది కూడా వినాయక చవితి సినిమాలోది.

వినాయక సుప్రభాతం:

భూషణ్ దుఆ దీనిని కంపోజ్ చేసారు. వినాయక సుప్రభాతం ని కూడా వినాయక చవితి నాడు ప్లే చేసుకోచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news