ఆధార్ కార్డు వినియోగదారులకు కేంద్రం తాజాగా అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. తాజాగా ముఖ్య ప్రకటన చేసింది. దీని వల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు.. ఆధార్ కార్డుతో ఏ మొబైల్ నెంబర్ లేదంటే ఏ మెయిల్ ఐడీ లింక్ అయ్యిందో ఈజీగా తెలుసుకునే, ధ్రువీకరించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు యూఐడీఏఐ తెలిపింది. కొన్ని సందర్భాల్లో కొంత మందికి ఆధార్ కార్డుతో ఏ మొబైల్ నెంబర్ లింక్ అయ్యిందో తెలుసుకోవడం కష్టంగా ఉన్న విషయం తమ వద్దకు వచ్చిందని పేర్కొంది..
ఇక ఆధార్ ఓటీపీ అనేది వేరే మొబైల్ నెంబర్‌కు వెళ్లిపోతోంది. అయితే ఇకపై ఆధార్ కార్డు కలిగిన వారు వారి ఆధార్‌కు ఏ మొబైల్ నెంబర్ లింక్ అయ్యింది, ఏ ఈమెయిల్ లింక్ అయ్యిందో ఈజీగానే తెలుసుకోవచ్చు.. ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ అయ్యిందో లేదో తెలుసుకోవాలి..ముందుగా మైఆధార్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ వెరిఫై ఈమెయిల్/ మొబైల్ నెంబర్ ఆనే ఆప్షన్ ఉంటుంది. లేదంటే ఎంఆధార్ యాప్‌లోకి అయినా వెళొచ్చు…
మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి. తర్వాత సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆధార్ కార్డు కలిగిన వారికి కన్ఫర్మేషర్ మెసేజ్ వస్తుంది.. అప్పుడు వేరే మొబైల్ నెంబర్ ఉంటే వెంటనే మొబైల్ నెంబర్ ను అప్డేట్ చేసుకోమని చెప్తుంది.. అప్పుడు మీరు మీ వద్ద ఉన్న మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేసుకోవచ్చు..
అందువల్ల ఈ ఫీచర్ ద్వారా ప్రజలు వారి ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్ లింక్ అయ్యిందో లేదో చూసుకోవచ్చు. అలాగే ఈమెయిల్ ఐడీకి కూడా ఇది వర్తిస్తుంది.. ఆధార్ వెబ్ సైట్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు లేదా.. దగ్గరలోని ఆధార్ సెంటర్ కు వెళ్లి చేసుకోవచ్చు..అలాగే మొబైల్ నెంబర్ ను, ఈమెయిల్ ఐడిని కూడా మార్చుకోవచ్చు..