ప్రముఖ ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా తమ కస్టమర్లకు ఎన్ని బెనిఫిట్స్ ను అందిస్తుంది.. ఎన్నో పథకాల ద్వారా చాలా మంది లబ్ది పొందుతున్నారు.. ఈ మేరకు రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది..రైతులకు ఈజీగానే ట్రాక్టర్ లోన్స్, ఇతర ఫామ్ మిషనరీ ప్రొడక్టులపై రుణాలు అందించేందుకు రెడీ అవుతోంది..దీనివల్ల రైతులకు ఇతరులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. ట్రాక్టర్ కొనేందుకు లేందటే ఇతర ఫామ్ మిషనరీ కొనేందుకు బ్యాంక్ నుంచి సులభంగా లోన్ పొందొచ్చు…పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
తాజాగా మహీంద్రా ఫామ్ ఎక్విప్మెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ట్రాక్టర్, ఫామ్ మిసనరీ ప్రొడక్టుల కొనుగోలుపై సులభంగా రుణాలు అందుబాటులో ఉండేటా మహీంద్రా చూసుకోనుంది. మూడు దశాబ్దాలుగా నెంబర్ 1 ట్రాక్టర్ బ్రాండ్‌గా కొనసాగుతూ వస్తున్నామని మహీంద్రా వెల్లడించింది. అలాగే ఎస్బీఐ కూడా అగ్రికల్చర్ ఫైనాన్స్‌లో అగ్రగామిగా కొనసాగుతోంది. ఏకంగా కోటి మందికి పైగా రైతులకు రుణాలు అందించింది. బ్యాంక్ అగ్రి లోన్ పోర్ట్‌ఫోలియో రూ. 2.45 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తుంది..
రైతులకు రుణాలను గరిష్టంగా రూ. 25 లక్షల వరకు లోన్ పొందొచ్చు. ట్రాక్టర్ లోన్ ఎవరైనా పొందొచ్చు. అయితే రెండు ఎకరాల పొలం ఉండాలి. సిబిల్ స్కోర్ 650కు పైన ఉండాలి. అప్లికేషన్, ట్రాక్టర్ కొటేషన్, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, పొలం పట్టా వంటివి అసవరం అవుతాయి. ఆధార్ కార్డు ,పాన్ కార్డు, పొలం పట్టా, డీలర్షిప్ నుంచి ట్రాక్టర్ కొటేషన్ ఉంటే చాలు లోన్ పొందోచ్చు..ట్రాక్టర్ లోన్స్‌పై బ్యాంక్ ఏడాదికి ఎంసీఎల్ఆర్ + 3.3 శాతం రుణ రేటును వసూలు చేస్తోంది. ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 8.5 శాతంగా ఉంది. అంటే రుణ రేటు 11.8 శాతంగా పడుతుంది. రూ. 2 లక్షల వరకు లోన్ అయితే ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. అదే ఈ లిమిట్ దాటితే లోన్ అమౌంట్లో 1.4 శాతం ప్రాసెసింగ్ ఫీజు పడుతుంది. కాగా ఎస్బీఐ నుంచి ట్రాక్టర్ లోన్ పొందాలని భావించే వరకు దగ్గరిలోని బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు..అర్హత కలిగిన వాళ్ళు దగ్గలోని బ్రాంచ్ నుంచే రుణాన్ని పొందోచ్చు…