అన్నదాతలకు మోదీ గుడ్ న్యూస్.. టార్గెట్ రూ.16 లక్షల కోట్లు..!

-

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం వివిధ రకాల స్కీమ్స్ ని ఇస్తోంది. దీనితో రైతులకి కాస్త ఆర్ధిక సహాయం అందుతుంది. ఇది ఇలా ఉంటే కేంద్రం కిసాన్ క్రెడిట్ కార్డ్ ని కూడా తీసుకు రావడం జరిగింది. రైతులకు ప్రభుత్వం ఇస్తున్న మరో వరం ఇది అని చెప్పచ్చు. అయితే ఈ పధకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రైతులకు రూ.16 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్‌ పెట్టుకోవడం జరిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

 

farmers

ఇందులో రూ.14 లక్షల రుణాలను ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం లక్షాన్ని చేరుకోవాలంటే మరో రూ.2 లక్షల కోట్ల రుణాలను ఇంకా రైతులకి ఇవ్వాల్సి వుంది. వీటిపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నేతృత్వంలో సమీక్షా సమావేశం జరిగింది. ఇది ఇలా ఉంటే కరోనా వైరస్ మహమ్మారి సమయంలో కూడా ఈ స్కీమ్ ద్వారా రైతులకు రుణాలు ఇచ్చామని చెప్పారు. అలానే వచ్చే ఏడాది నాటికి రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ద్వారా రుణాలు ఇస్తామని తెలిపారు.

వ్యవసాయం చేసే రైతులు మార్కెట్‌లో ఎక్కువ వడ్డీకి అప్పులు చేయకుండా బ్యాంకుల దగ్గరే తక్కువ వడ్డీకి రుణాలు పొందొచ్చు. రైతులు ష్యూరిటీ లేకుండా రూ.1,60,000 వరకు రుణం తీసుకోవచ్చు. అదనంగా కాంప్లిమెంటరీ ఇన్స్యూరెన్స్ కవరేజీ లభిస్తుంది. ఆ తరవాత అప్పుని చెల్లించాలి. దగ్గర్లో ఉన్న బ్యాంకులో కిసాన్ క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేయొచ్చు. బ్యాంకుకు వెళ్లి కిసాన్ క్రెడిట్ కార్డు సెక్షన్‌లో దరఖాస్తు ఫామ్ తీసుకోవాలి. దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి సబ్మిట్ చేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news