మీ పిల్లల ఫ్యూచర్ కోసం ఆలోచిస్తున్నారా? వీటిని అస్సలు మర్చిపోకండి..

-

పిల్లలు పుట్టక ముందు నుంచి తల్లి దండ్రులు వాళ్ళ భవిష్యత్ కోసం చేస్తున్నారు.అయితే మంచి లాభాలు పొందాలని అనుకోనేవాల్లు మాత్రం వీటిని గమనించండి..

 

ఈ రోజుల్లో అత్యంత ప్రజాదరణ పొందిన పథకాలలో ఇది ఒకటి. ఇందులో పెట్టుబడి పెడితే 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. మీరు పిల్లల పేరుతో ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో రూ. 1.5 లక్షల పెట్టుబడిపై ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద మినహాయింపు లభిస్తుంది. పిల్లల ఖాతాలో రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి కాల పరిమితి 15 సంవత్సరాలు…

ఇకపోతే కుమార్తె కోసం పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లయితే, సుకన్య సమృద్ధి యోజన మంచి ఎంపిక అవుతుంది. మీరు ఇందులో సంవత్సరానికి కనిష్టంగా రూ. 250 పెట్టుబడి పెట్టాలి. అలాగే గరిష్టంగా ఒక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెడితే మీకు 7.60 శాతం వడ్డీ లభిస్తుంది. మీరు ఈ పథకంలో 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. ఆడపిల్లకి 18 ఏళ్లు నిండిన తర్వాత ఆమె చదువుల కోసం అలాగే అమ్మాయికి 21 ఏళ్లు నిండితే పెళ్లి కోసం ఈ డబ్బును తీసుకోవచ్చు.

మ్యూచువల్ ఫండ్ సిప్ లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. సిప్ లో పెట్టుబడి పెట్టడానికి మీరు రూ.100తో చిన్న మొత్తంలో ప్రారంభించవచ్చు. వీటితో పాటు బ్యాంకులో డబ్బు ఆదా చేయాలని ప్లాన్ చేస్తుంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ మంచి ఎంపిక..5 నుంచి 10 సంవత్సరాలకు పిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయవచ్చు. ఇలాంటి ప్లాన్‌లు ఎంచుకోవడం వల్ల మీ డబ్బు సేఫ్ గా ఉండటంతో పాటుగా మంచి లాభం కూడా ఉంటుంది.. మీకు నచ్చితే మీరు కూడా ఇవి ప్లాను చేసుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version