పిల్లల కోసం ఆరోగ్య భీమా తీసుకోనేవారికి హెచ్చరిక..ఇది మీ కోసమే..

-

తల్లిదండ్రుల అవ్వాలని ప్రతి జంట అనుకోవడం సహజమే.. అయితే పిల్లల భవిష్యత్తు గురించి కూడా ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. అప్పుడే పిల్లల భవిష్యత్తు బంగారు బాటలో పయనిస్తుంది. పిల్లలు పుట్టినప్పటి నుంచి పెరిగి చదివి, పెద్దై వాళ్ళు సంపాదించేవరకు చూసుకోవడం తల్లిదండ్రులు భాధ్యత..తల్లిదండ్రులు బిడ్డల అవసరాలు, చదువు వంటి వాటిపైనే కాకుండా పిల్లల ఆరోగ్య సంరక్షణ మీద కూడా దృష్టి సారించాలి. ఇందుకోసం ఆరోగ్య బీమా సాయపడుతుంది. పిల్లల కోసం చాలా ఆరోగ్య బీమా ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, పిల్లల ఎదుగుదల క్రమాన్ని అనుసరించి తగిన ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకోవడం చాలా అవసరం..

ఈ భీమా కవరేజీ అనేది పిల్లలు కడుపులో ఉన్నప్పటి నుంచి మొదలవుతుంది.ఇది గర్భధారణ నుంచి ప్రసవం వరకు కవరేజీని ఇస్తుంది. పిల్లల కోసం ప్లాన్‌ చేస్తున్నవారు తమ ఆరోగ్య బీమా పాలసీలో ప్రసూతి ప్రయోజనాల కవరేజీ ఉన్నది లేనిదీ చెక్‌ చేసుకోవాలి. ఈ ప్రయోజనాలను అందించే పాలసీలు సాధారణంగా 24 నుంచి 48 నెలల వెయిటింగ్‌ పీరియడ్‌తో వస్తాయి. కాబట్టి, పాలసీ తీసుకునే ముందు వెయిటింగ్‌ పీరియడ్‌ను తెలుసుకోవాలి. తక్కువ వెయిటింగ్‌ పీరియడ్‌ ఉన్న పాలసీని ఎంచుకోవడం మంచిది..కృత్రిమ గర్భధారణ, ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ వంటివి పాలసీలో కవర్‌ కావు..ఇది గుర్తుంచుకోండి..

అయితే, అప్పుడే పుట్టిన బిడ్డకు ఆటోమేటిక్‌గా కవరేజీని అందించే ఆరోగ్య బీమా ప్లాన్‌లను ఎంచుకోవడం మంచిది. వీటి ద్వారా పిల్లల పుట్టినప్పటి నుంచే ఆరోగ్య బీమా రక్షణ కల్పిస్తుంది. ఒకవేళ మీరు ఇలాంటి పాలసీని తీసుకుని ఉంటే శిశువు జననంపై బీమా సంస్థకు పూర్తి వివరాలను తెలియజేయాలి. ప్రసూతి ప్రయోజనాల కింద తీసుకున్న పాలసీలు పుట్టిన పిల్లలను నిర్దిష్ట రోజుల వరకు మాత్రమే కవర్‌ చేస్తాయి. సాధారణంగా ఈ పాలసీలు జన్మించిన శిశువుకు 90 రోజుల వరకు రక్షణ కల్పిస్తుంటాయి. కొన్ని పాలసీలు బిడ్డ పుట్టిన మొదటి రోజు నుంచి అందుబాటులో ఉండగా.. మరికొన్ని పాలసీలు బిడ్డ పుట్టిన 90 రోజుల తర్వాత కవరేజీని అందిస్తాయి. ఇవి పిల్లల ఆసుపత్రి ఖర్చులు, వ్యాక్సినేసన్‌ వంటి వాటిపై కవర్‌ చేస్తాయి.

పిల్లల ఖర్చులు మాములుగా ఉండవు..పిల్లలకు ఆర్థిక స్వేచ్ఛ వచ్చేవరకు, వారి బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది. అయితే కొన్ని ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీలు పిల్లలను కొంత వయసు వరకు మాత్రమే అనుమతిస్తాయి.ఇలాంటి పాలసీలు జనాలకు ఉపయోగపడతాయి..

గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు..

పిల్లలు జన్మించిన నాటి నుంచి ఆరోగ్య బీమా సంరక్షణలో ఉంటే.. అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఆందోళన చెందకుండా మెరుగైన చికిత్సను అందించవచ్చు.

ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీ తీసుకున్న వ్యక్తితో పాటు అతడి భార్య, పిల్లలను కూడా కవర్‌ చేస్తుంది. ఒకే ప్రీమియంతో కుటుంబం అంతటికీ రక్షణ లభిస్తుంది. కాబట్టి, తగినంత కవరేజీ ఉండేలా చూసుకోవాలి. అలాగే, సాధ్యమైనంత వరకు రిస్టోరేషన్‌ బెనిఫిట్‌తో కూడిన పాలసీలను తీసుకోవడం మంచిది. దీనివల్ల అధిక ప్రయోజనం ఉంటుంది.

పిల్లలు చాలా తర్వగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓపీడీ సేవలను, రెగ్యులర్‌ చెక్‌-అప్‌లను కవర్‌ చేసే పాలసీ ఎంచుకోవడం మంచిది.
నెట్ వర్క్ వున్న పెద్ద ఆసుపత్రిలో ఆరోగ్య భీమా గురించి తెలుసుకోవాలి..

పిల్లలకు అత్యుత్తమ చికిత్స అందాలి. కాబట్టి, నెట్‌ వర్క్‌ ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన శిశువైద్యులు, పిల్లల వైద్య నిపుణులు ఉన్నారో లేదో ముందుగానే చెక్ చెయ్యండి ..

Read more RELATED
Recommended to you

Exit mobile version