హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు గెలిచే సత్తా ఉందా? అంటే అంతా ఓపెన్‌గా మాట్లాడుకుంటే గెలిచే సత్తా లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పోరు కేవలం ఈటల రాజేందర్-టిఆర్ఎస్ల మధ్యే జరుగుతుందని అర్ధమైపోతుంది. అందుకు తగ్గట్టుగానే రాజకీయం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ బరిలో దిగబోయే కాంగ్రెస్ అభ్యర్ధి బట్టి….హుజూరాబార్ పోరు కాస్త మారే అవకాశాలున్నాయని ప్రచారం నడిచింది.
కాంగ్రెస్ గనుక రెడ్డి వర్గానికి చెందిన అభ్యర్ధిని పెడితే ఈటలకు, ఎస్సీ అభ్యర్ధిని పెడితే టిఆర్ఎస్కు లేదా బిసి అభ్యర్ధిని పెడితే రెండు పార్టీలకు కాస్త డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని చర్చ నడిచింది. కానీ అనూహ్యంగా కాంగ్రెస్..కేసిఆర్ సామాజికవర్గమైన వెలమ వర్గానికి చెందిన వెంకట్‌ని బరిలోకి దింపింది. వెంకట్ అసలు పేరు…బల్మూరి వెంకట్ నరసింగ్‌రావు.
ఇక వెలమ వర్గానికి చెందిన అభ్యర్ధిని దింపడం వెనుక కాంగ్రెస్ స్ట్రాటజీ ఉందని అర్ధమవుతుంది. హుజూరాబాద్‌లో వెలమలో పెద్ద సంఖ్యలో లేరు. ఉన్నా టిఆర్ఎస్కు వన్‌సైడ్ గా ఓటు వేస్తారు…ఇప్పుడు వెంకట్ దిగడంతో కాస్త ఓట్లలో చీలిక రావొచ్చు. అన్నికంటే ముఖ్యంగా ఈటలకు పడే ఓట్లని కాంగ్రెస్ చీల్చే అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి. అసలు ఈటలకు రెడ్డి ఓట్లు గానీ, బిసి ఓట్లు గానీ పెద్ద సంఖ్యలో పడే ఛాన్స్ ఉంది. అటు దళితబంధు ఎఫెక్ట్‌తో సగం దళిత ఓట్లు టిఆర్ఎస్కు పడే ఛాన్స్ లేకపోలేదు. కానీ ఈటల మీద అభిమానం, మాజీ వివేక్ లాంటి నాయకుల ఎఫెక్ట్‌తో కొందరు దళితులు ఈటలకే మొగ్గు చూపే ఛాన్స్ ఉంది.
అయితే దళితబంధు లాంటి పథకం వల్ల టిఆర్ఎస్కు దళిత ఓట్లు ఎంత ప్లస్ అవుతాయో….బిసి ఓట్లు అంత మైనస్ అవుతాయి. హుజూరాబాద్‌లో లక్ష పైనే బిసి ఓట్లు ఉన్నాయి. మెజారిటీ ఓట్లు ఈటలకే పడతాయని తెలుస్తోంది. ఏది ఎలా చూసుకున్న కాంగ్రెస్ వల్ల టిఆర్ఎస్కే డ్యామేజ్ జరిగేలా ఉంది. మొత్తానికి కాంగ్రెస్…హుజూరాబాద్ పోరుని ఈటలకు అనుకూలంగా మార్చేసినట్లు కనిపిస్తోంది.