అమరావతి : సిఎం జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. కల్తీ సారా మరణాలపై శాసన మండలిలో ప్రభుత్వం చర్చకు రాకుండా పారిపోయిందని ఫైర్ అయ్యారు. శవ రాజకీయాలకు జగన్ బ్రాoడ్ అంబాసిడర్ అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు నారా లోకేష్. తండ్రి శవం దొరక్క ముందే సీఎం సీటు కోసం సంతకాలు సేకరణ చేపట్టిన వ్యక్తి జగన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మనకు తెలిసి చనిపోయింది 25 మందే, తెలియకుండా రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన వారి సంఖ్య తేలాలని నిలదీశారు. మరణాలపై చర్చ చేపట్టకుండా ప్రభుత్వం ఇచ్చే ప్రకటన విని వెళ్లిపోవాలంటే ఎలా..? అని ప్రశ్నించారు నారా లోకేష్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దుకాణాల కాలపరిమితిని పెంచి మరీ మద్యం విక్రయాలు జరిపిస్తున్నారని.. అధిక ధరలకు సర్కారీ మద్యం కొనలేక కల్తీసారా తాగి ప్రాణాలు కోల్పోతున్నారని అగ్రహించారు నారా లోకేష్. సొంత బ్రాండ్లు తేవడమే మద్యపాన నిషేధమా? మద్యం రెట్లు పెంచడం వల్ల తాగేవాళ్లు తగ్గలేదు … చనిపోయే వాళ్ళ సంఖ్య పెరిగిందని నిప్పులు చెరిగారు