టాలీవుడ్ స్టార్ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మోహన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎప్పుడు ఏదో ఒక వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తారు. ఈ మధ్యే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…పై కామెంట్లు చేసి.. వివాదానికి తెర లేపారు. ఇక తాజాగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి.. దేవుడి ప్రసాదం లాంటోడని పేర్కొన్నారు పోసాని.
“ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ గారి గురించి నేను ఒకే ఒక్క మాట చెబుతా. రెండో ప్రశ్నే అడగడానికి వీల్లేదు. ఆయన దూరం నుంచి బ్రహ్మ పదార్థంలా కనబడతారు. దగ్గరి నుంచి చూస్తే దేవుడి ప్రసాదంలా కనపడతారు”అని పోసాని చెప్పారు. ఇక ప్రస్తుతం తాను ఐదారు సినిమాల్లో నటిస్తున్నారని.. ఏ పని అందుబాటు లో ఉంటే.. తాను ఆ పని చేస్తానని స్పష్టం చేశారు పోసాని కృష్ణ మోహన్. తాను శ్రీ వారి సన్నిధికి ఎన్ని సార్లు వచ్చానో లెక్కలేదని పేర్కొన్నారు. ఏపీకి జగన్ లాంటి నాయకుడు ఉండాలని చెప్పారు పోసాని కృష్ణ మోహన్.