ప్రకృతి ప్రసాదించిన అనేక ఔషధగుణాలున్న వాటిలో మనం ఇప్పటికే చాలా వాటి గురించి తెలుసుకున్నాం..చాలామంది మహిళలు వంటల్లో వాడే పదార్థాల్లో ఉన్న అసలైన ప్రయోజనాలు తెలియకుండానే వాడేస్తుంటారు. మంచి సువాసన వస్తుంది అని..బిర్యానిలో చాలా రకాల ఐటమ్స్ వేస్తుంటాం.. అందులో ఒకటి అనాసపువ్వు. బిర్యానీ, పులావుల్లో ఇది లేకుండా ఆ సువాసన రాదు. కుర్మాల్లో, మసాలల్లో కూడా ఇది వాడుతుంటారు. అయితే అనాసపువ్వు కేవలం వాసన కోసమో, రుచి కోసమో మాత్రమే వాడటం లేదు..ఇందులో చాలా ఆరోగ్యకరమైన లాభాలు ఉన్నాయి..అవి ఏంటో చూద్దాం.
అనాస పువ్వు స్త్రీలకు స్పెషల్ బెనిఫిట్స్ కలిగిస్తుంది..రుతుక్రమంలో వచ్చే కడుపునొప్పికి, బాలింతలకు పాలతయారీకి ఈ పువ్వులో ఇస్ట్రోజన్ లా పనిచేసే కెమికల్ ఉపయోగపడుతుందని సైంటిస్టులు నిరూపించారు.
స్త్రీలకు మెనోపాజ్ వల్ల వచ్చే హార్ట్ ఫ్లషన్స్ ను తగ్గించడానికి ఇందులో ఉండే కెమికల్స్ బాగా పనికొస్తున్నాయి. హార్మోన్ ఇంబాలెన్స్ మగవారిలో పోలిస్తే ఆడవారిలో ఎక్కువగా ఉంటాయి. హార్మోన్ బ్యాలెన్స్ చేయడానికి కూడా ఈ పువ్వులో ఉండే కెమికల్స్ ఉపయోగపడతాయి.
ఇందులో 35-40 రకాల యాంటీఆక్సీడెంట్స్ చాలా ఉండటంతో..కొద్ది మోతాదులో వాడినప్పటికీ మెడిసినల్ ప్రోపర్టీస్ అన్నీ అందుతాయి. ముఖ్యంగా లినోలాల్( Linalool), క్వర్సటిన్ ( Quercetin),లాంటివి హైడోసుల్లో ఉండటం వల్ల కొద్ది మోతాదులో వాడినా ఇవన్నీ రక్షణ వ్యవస్థను యాక్టీవేట్ చేయడానికి, వైరస్, ఫంగస్, బాక్టీరియాలను చంపేవిధంగా బాడీ చంపేవిధంగా చేయడానికి, బాడీలో డీటాక్సిఫికేషన్ చేయడానికి ఇవన్నీ బాగా పనికొస్తున్నాయని సైంటిస్టులు తెలిపారు.
ఇందులో ఉన్న ఇంకో ముఖ్యమైన లాభం ఏంటంటే…ప్రేగుల్లో కదలికలు పెంచి..మోషన్ సులువుగా జరిగే గుణం ఈ పువ్వులో ఉందట. అందుకే కొందరు పలావులు, బిర్యానీలు తిన్నప్పుడు మోషన్ కు రెండుసార్లు అయినా వెళ్తారు..ఇక వాళ్లు పలావు పడలేదు..అందుకే మోషన్స్ అవుతున్నాయి అనుకుంటారు..కానీ కారణం ఏంట్రా అంటే..అందులో వాడిన ఈ పువ్వు వల్ల ప్రేగులు క్లీన్ అవుతున్నాయి.
అనాస పువ్వు ఆయిల్ కూడా నాచురల్ పెయిన్ కిల్లర్ గా ఉపయోగపడుతుందట. నరాల పెయిన్ తట్టుకోవడానికి ఈ అయిల్ ను అప్లై చేస్తే నొప్పులు తగ్గించుకోవచ్చు.
అనాస పువ్వును ఎలా వాడుకోవచ్చు.?
కూరల్లో, బిర్యానీల్లో మనం ఎలాగో వాడుతుంటాం..కానీ పీరియడ్స్ టైంలో వచ్చే పెయిన్స్ తగ్గాలన్నప్పుడు ఈ అనాస పువ్వు రేకులన్ని పొడిగా చేసుకుని అందులో చిటికెడు కుంకుమపువ్వు తీసుకుని రెండు కలిపి పాలల్లో వేసుకుని తాగితే.. స్త్రీలకు ఇస్ట్రోజన్ హార్మోన్ లా పనిచేసి పెయిన్స్ తగ్గుతాయి. కుంకుమపువ్వు లేకుంటే.. పువ్వు పొడికి తేనె కలుపుకుని నాకేసినా సేమ్ రిజల్ట్ ఉందని..సుమారుగా 55 పరిశోధనల విషయాన్ని తీసుకుని 2012లో యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇరాన్ వారు ఇచ్చారు.
ప్రకృతి ఇచ్చిన అనాసపువ్వులో ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి..కేవలం మసాల వంటల్లోనే కాకుండా…పైన చెప్పిన సమస్యలు ఉన్నవారు కూడా ఉపయోగించుకోవచ్చు. అప్పుడప్పుడు మీరు తినే ఆహారంలో కూడా వేసుకున్నా.. ప్రేగులు క్లీన్ అవుతాయి. సందర్భాన్ని బట్టీ వాడుకుంటే..అనాస పువ్వు వల్ల వచ్చే ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా స్త్రీలకు పిరియడ్ పెయిన్ చాలా ఘోరంగా ఉంటాయి..వాటిని తట్టుకోవడాని టాబ్లెట్స్ వాడుతుంటారు.. కానీ అలాంటి టాబ్లెట్స్ వాడటం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. పెయిన్స్ తగ్గించుకోవడానికి నాచురల్ మార్గాలను చూసుకోవడం ఉత్తమం.!
-Triveni Buskarowthu