తెలంగాణ రాష్ట్ర్ర బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్.. కాంగ్రెస్ పార్టీ లో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షం లో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్.. కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
అయితే ఎర్ర శేఖర్ చేరికను వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నేరచరిత్ర కలిగిన ఎర్ర శేఖర్ ను ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి…. తమ్ముడిని చంపాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎర్ర శేఖర్ ను చేర్చుకోవడం సరైంది కాదంటున్నారు.
అటు ఇతర నేతలు కూడా ఎర్ర శేఖర్ ను చేర్చుకోవడం సరైంది కాదంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎర్రశేఖర్ చేరికకు కోమటిరెడ్డి దూరంగా ఉన్నారు. గాంధీ సిద్దాంతాలు నమ్మే కాంగ్రెస్ లోకి నేరగాళ్లు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎర్రశేఖర్ చేరిక పై అదిష్టానానికి ఫిర్యాదు చేసే ఆలోచనలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నట్లు సమాచారం అందుతోంది.