మామల రక్షిస్తానన్న జగన్.. ప్రాణాలు తీస్తున్నాడని నారా లోకేష్ ఫైర్ అయ్యారు. మామలా రక్షిస్తానన్న మాయ మాటలు చిన్నారి సంధ్య ప్రాణాలు తీసుకువస్తాయా జగన్ రెడ్డి గారూ! వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఆ గ్రామ సమస్యలపై కనీస దృష్టి సారించినా చిన్నారి సంధ్య మన మధ్య ఉండేదని తెలిపారు.
అమ్మ ఒడి ఇచ్చానంటూ అమ్మ ఒడిలో బిడ్డల ప్రాణాలు తీయడం న్యాయమేనా? విలీన మండలాల్లో విషజ్వరాలతో జనం విలవిల్లాడుతున్నారు. ఆస్పత్రిలో పరీక్షల కిట్లు, మందులు లేవు. చింతూరు ఏరియాలో ఇప్పటివరకూ నలుగురు మృతిచెందినా సర్కారులో చలనం లేదు. ముఖ్యమంత్రి గారు, మానవత్వం అనేది ఏ మూలన ఉన్నా.. సంధ్యలాంటి మరో చిన్నారి బలి కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగులపై ఉక్కుపాదమా?మీరిచ్చిన హామీలు నెరవేర్చమంటే ఈ నిర్బంధాలేంటి జగన్ రెడ్డి గారు? ప్రతిపక్షంలో వున్నప్పుడు మీరు ఇచ్చిన మాట నెరవేర్చాలని ఉద్యోగులు డిమాండ్ చేయడమే దేశద్రోహంగా సీపీఎస్ ఉద్యోగుల ఉద్యమంపై ఉక్కుపాదం మోపడం దారుణం. న్యాయమైన డిమాండ్ల సాధనకి శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కునీ హరించడం ముమ్మాటీకీ నియంతృత్వ పోకడే అని విమర్శలు చేశారు.