BREAKING : హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన..బయటకు రావొద్దని ఆదేశాలు

-

హైదరాబాద్‌ మహా నగరంలో దంచికొడుతోంది వర్షం. దాదాపు గంట నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి కాస్త ఎండగా ఉన్నప్పటికీ… సాయంత్రం 6 తర్వాత వర్షం ప్రారంభం అయింది. ఇప్పటి వరకు కూడా వర్షం ఏ మాత్రం తగ్గడం లేదు.

తాజాగా హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపిన నివేదిక ప్రకారం.. జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా 4.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. చందానగర్-4.3 సెం.మీ., అత్తాపూర్-2.3 సెం.మీ, మియాపూర్-1.2 సెం.మీ. వర్షపాతం నమోదు అయింది.

ఇక ఈ భారీ వర్షం నేపథ్యంలోనే.. ట్రాఫిక్‌ జామ్‌ అయింది. దాంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక అటు ఇండ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు జీహెచ్‌ఎంసీ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news