మరోసారి కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారని అన్నారు. రాష్ట్రంలో జిల్, పెట్రోల్ పై అధిక ధరలు వేసి ప్రజల మీద భారం మోపుతున్నారని చెప్పారు. కేంద్ర నిధులతోనే అభివృద్ధి జరుగుతోందని, వాటిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు వివేక్ వెంకటస్వామి. రాష్ట్రంపై రూ.5 లక్షల కోట్ల అప్పులు మోపారని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు.
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మాజీ సర్పంచ్ విఠల్ రెడ్డి తల్లి ఇటీవల అనారోగ్యంతో మరణించారు వివేక్ వెంకటస్వామి. ఇవాళ వారి కుటుంబ సభ్యలను వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. విఠల్ రెడ్డి, ఆయన తమ్ముడు రమేష్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులను వివేక్ పరామర్శించారు వివేక్ వెంకటస్వామి.