Breaking : రష్యాను వణికిస్తున్న ‘ఫ్లూ’… బంకర్‌లోకి పుతిన్‌

-

రష్యాలో ఫ్లూ వైరస్ విజృంభిస్తుండటంతో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వీయ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే అనేక ప్రాంతాలకు పాకిన ఈ వైరస్ కారణంగా క్రెమ్లిన్‌లోని పలువురు ప్రభుత్వ అధికారులు దాని బారినపడి తెలుస్తోంది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహితులు కూడా ఫ్లూతో ఆసుపత్రిలో చేరినట్టు చెబుతున్నారు. అంతేకాదు, ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న పుతిన్‌ను ఈ ఫ్లూ బారినపడకుండా అధికారులు బంకర్‌లోకి తరలించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పుతిన్ ప్రస్తుతం ఆ బంకర్‌లోనే ఐసోలేషన్‌లోనే ఉన్నారని, నూతన సంవత్సర వేడుకలను కూడా అక్కడే కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటారని అక్కడి మీడియా పేర్కొంది. నిజానికి పుతిన్ ఆరోగ్యంపై గత కొంతకాలంగా వదంతులు వినిపిస్తున్నాయి. పుతిన్ కేన్సర్ బారినపడ్డారంటూ ఇటీవల వార్తలు హల్‌చల్ చేశాయి. దీనికి తోడు ఇటీవల ఆయన తన నివాసంలో మెట్లు దిగుతూ పడిపోయారని కూడా వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు మీడియాలో కథనాలు వచ్చాయి.

Putin Says Russia May Add Nuclear First Strike to Strategy - Bloomberg

పుతిన్ కేన్సర్‌తో పోరాడుతున్నట్టు గతంలో యూకే ఇంటెలిజెన్స్ కూడా నివేదిక ఇచ్చింది. ఆయన మరెన్నో రోజులు బతకరని కూడా పేర్కొంది. అయితే, ఈ విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ధ్రువీకరణ లేకపోవడం, అడపాదడపా పుతిన్ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటుండడంతో ఈ పుకార్లలో నిజమెంత అన్నది మిస్టరీగానే మిగిలిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news