రాజకీయాల్లో సెంటిమెంట్ అన్నివేళలా కలిసొస్తుందా? అంటే అది చెప్పలేం..ఏదో కొన్ని సార్లు వర్కౌట్ అవుతుంది గాని…అన్నిసార్లు వర్కౌట్ అవ్వడం అంటే కష్టమే..అయినా సరే ఏపీలో సిఎం జగన్ మళ్ళీ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్లు కనిపిస్తున్నారు. మరొకసారి అధికారంలోకి రావడానికి ఆయన సెంటిమెంట్‌ని నమ్ముకున్నారు. వాస్తవానికి వైసీపీ పార్టీ వచ్చిందే సెంటిమెంట్ పునాదులు మీద అని చెప్పవచ్చు. వైఎస్సార్ చనిపోవడంతో జగన్ వైసీపీ పెట్టారు.
ఇక జగన్ పలు కేసుల్లో జైలుకు వెళ్ళడంతో 2012 ఉపఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. కానీ ఆ సెంటిమెంట్ 2014 ఎన్నికల్లో కనిపించలేదు. అప్పుడు పార్టీ ఓడిపోయింది. 2019 ఎన్నికలకు వచ్చేసరికి ఒక్క ఛాన్స్ అని ప్రజలని జగన్ అడిగారు. అది కూడా ఒక సెంటిమెంట్ మాదిరిగా వర్కౌట్ అయింది. ఇక జగన్ పాలన కూడా చూడాలని ప్రజలు వైసీపీకి ఓటు వేసి గెలిపించారు. ఇంకా మరోసారి గెలవడానికి జగన్ మళ్ళీ సెంటిమెంట్ ప్రయోగిస్తున్నారు.
తాను ఒంటరి అని, ప్రజలే అండగా ఉండాలని, పేదల మనిషిని అని, పెత్తందార్లతో యుద్ధం చేస్తున్నామని, తోడేళ్లు అన్నీ ఏకమవుతున్నాయని చంద్రబాబు, పవన్ గురించి కామెంట్ చేస్తున్నారు. పొత్తులు, ఎత్తులు, కుయుక్తులు తనకు తెలియవని, నిజాలు మాట్లాడటమే తనకు తెలుసని, ప్రజలతోనే తనకు పొత్తు అని, ఇక తనకు మీడియా మద్దతు కూడా లేదని జగన్ అంటున్నారు.
అయితే ఈ మాటలు పూర్తిగా సెంటిమెంట్ తోనే ఉన్నాయి. కానీ వీటిల్లో కొన్ని లాజిక్‌లు లేవు..సొంత మీడియా లేదంటే ప్రజలు నమ్మరు..ఎందుకంటే జగన్ కు సొంత మీడియా, సపోర్ట్ మీడియా ఉందనే సంగతి అందరికీ తెలుసు. పథకాలతో పేదలకు మేలు చేశానని అంటున్నారు. కానీ పేదలపై పన్నుల భారం కూడా వేశారు. జగన్ మాట తప్పుతారో లేదో ప్రజలు చూశారు. ఇక బాబు, పవన్ డైరక్ట్ గా పొత్తు పెట్టుకోవడానికి చూస్తున్నారు…కానీ జగన్..బిజేపితో చీకటి ఒప్పందం చేసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. కాబట్టి అన్నివేళలా సెంటిమెంట్ వర్కౌట్ అవ్వడం కష్టమే.