ఇఫ్తార్ విందుకు హాజరైన సీఎం కేసీఆర్…

-

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…. మైనారిటీల సంక్షేమానికి రూ.12 వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. తెలంగాణ ముందుకు వెళుతోంది… దేశం వెనుకబడిపోతోంది అని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. దేశాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలుగా పాటుపడతామని తెలిపారు. ఆవేశంతో కాకుండా, ఆలోచనతో దేశాన్ని పరిరక్షించుకుందామని అన్నారు.

CM KCR attends Iftar in Hyderabad

ఈ దేశం మనది, ఆఖరి రక్తపుబొట్టు వరకు దేశం కోసం పోరాటం సాగిద్దాం అని పిలుపునిచ్చారు. మన గంగా యమునా తెహజీబ్ సంస్కృతి ఎంతో గొప్పదని పేర్కొన్నారు. ఈ ఇఫ్తార్ విందుకు సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తదితరులు హాజరయ్యారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అంతిమంగా గెలిచేది న్యాయమేని కేసీఆర్ స్పష్టం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news