టాలీవుడ్ డైరెక్టర్ తో కోలీవుడ్ హీరో విజయ్ సినిమా!

-

కొంతకాలం క్రితం వరకూ కోలీవుడ్ స్టార్ హీరోలు తాము అక్కడ చేసిన సినిమాలను తెలుగులో రిలీజ్ చేసేవారు. అవి అనువాద సినిమాలుగానే ప్రేక్షకుల ముందుకు వచ్చేవి. బలమైన కంటెంట్ ఉంటే మాత్రం ఇక్కడ కూడా బాగానే ఆడేవి. కానీ ఈ మధ్య కాలంలో ట్రెండ్ మారిపోయింది. దళపతి విజయ్‌తో ప్రాజెక్ట్ సెట్ చేసే పనిలో పడ్డాడు. రీసెంట్‌గా విజయ్‌కు కథ చెప్పినట్లు తెలుస్తుండగా.. ఆయన కూడా ఇంప్రెస్ అయినట్లు సమాచారం.

Vijay to join hands with Gopichand Mallineni next? - Only Kollywood

గోపీచంద్ మలినేని చెప్పిన పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌కు విజయ్ సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చెప్పాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక గోపీచంద్ ట్రాక్ రికార్డ్ విషయానికొస్తే.. ‘క్రాక్, వీరసింహారెడ్డి’ వంటి మాస్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చాడు. ఈ రెండు చిత్రాల్లోనూ హీరోను మాస్‌గా ప్రజెంట్ చేయడంలో గోపీ సక్సెస్ అయ్యాడు. ఇక విజయ్‌కు చెప్పిన స్టోరీ కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉందని, అన్నీ సెట్ అయితే ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను భారీ బడ్జెట్‌తో బైలింగువల్‌గా తెరకెక్కిస్తారని తెలుస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news