ఎడిట్ నోట్: కేసీఆర్ ‘సర్వే’ టెన్షన్.!

-

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతుంది..సరిగా 6 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి..ఈ క్రమంలో మళ్ళీ గెలిచి అధికారంలోకి రావాలని కే‌సి‌ఆర్ చూస్తున్నారు..అటు కాంగ్రెస్, బి‌ఆర్‌ఎస్ పార్టీలు సైతం అధికారం దక్కించుకోవాలని కష్టపడుతున్నాయి. అయితే ముచ్చటగా మూడోసారి అధికారం దక్కించుకోవడమే కే‌సి‌ఆర్ టార్గెట్ గా పెట్టుకున్నారు. అనుకున్న మేర బి‌జే‌పి, కాంగ్రెస్ బలపడకపోవడం బి‌ఆర్‌ఎస్ పార్టీకి ప్లస్.

కాకపోతే వరుసగా రెండుసార్లు అధికారంలో ఉండటం వల్ల సహజంగానే బి‌ఆర్‌ఎస్ పై కాస్త  వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. అలాంటి వారికి మళ్ళీ సీట్లు ఇస్తే గెలవడం కష్టం. అందుకే కే‌సి‌ఆర్ ఎప్పటికప్పుడు సొంత ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేయిస్తున్నారు..పార్టీ పరిస్తితిని అంచనా వేస్తున్నారు. ఇటీవల కూడా వరుసగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీని ద్వారా బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ప్రజలకు దగ్గరవుతారని ప్లాన్ చేశారు. కానీ దీని వల్ల బి‌ఆర్‌ఎస్ లో అంతర్గత పోరు బయటపడుతుంది.

 

ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో రచ్చ నడుస్తోంది. ఇక ఈ పరిస్తితులని పూర్తిగా అంచనా వేసిన కే‌సి‌ఆర్..గ్రౌండ్ లెవెల్ నుంచి సర్వే చేయించి రిపోర్టులు తెప్పించుకున్నారని తెలిసింది. ఇక  ఈ నెల 27న జరిగే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కీలకం కానుంది. ఇప్పటికే సేకరించిన సర్వే నివేదికల ఆధారంగా ఎక్కడ ఎలాంటి నిర్ణయాలతో ముందుకెళ్లాలనే దాని పైన కే‌సి‌ఆర్ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది.

పని తీరు మెరుగుడపని ఎమ్మెల్యేల విషయంలో ఫైనల్ వార్నింగ్ తప్పదని, నియోజకవర్గాల్లో జరిగిన సర్వే అంశాలను ప్రస్తావిస్తూ పార్టీ బలోపేతాని దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. అటు ఎమ్మెల్యేలు ఇంకా ప్రజలతో మమేకమయ్యేందుకు వ్యూహాలతో అధినేత కేసీఆర్ సందేశం ఇవ్వనున్నారు. మొత్తం మీద ఎమ్మెల్యేల భవితవ్యం కే‌సి‌ఆర్ తేల్చనున్నారు. మరి చూడాలి ఈ సారి ఎంతమంది ఎమ్మెల్యేలకు కే‌సిఆర్ షాక్ ఇస్తారో చూడాలి..ఈ సారి కూడా బి‌ఆర్‌ఎస్ పార్టీని గెలిపిస్తారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news