టమోటాలకు బౌన్సర్లను కాపలా పెట్టిన కూరగాయల వ్యాపారి.. అసలు విషయం అదే..!

-

టమోటా ధరలు కొన్ని చోట్లు డబుల్‌ సెంచరీ కూడా దాటేశాయి. ఇక సామాన్యులు అయితే వాటిని కొనడమే మానేశారు. ఒకప్పుడు కేజీ 10-20కి వచ్చేవి ఇప్పుడు 100-500 పైనే ఉంటున్నాయి. రెస్టారెంట్లో వెజ్‌ పిజ్జా నుంచి టామాటలను కట్‌ చేశారు. మార్కెట్‌లో వీటికి రక్షణ లేకుండా పోయింది. ఇంతకుముందు ఉల్లిపాయల రేట్లు పెరిగినప్పుడు కూడా ఇంతే రాత్రుళ్లు వచ్చి చోరే చేసేవాళ్లు. ఇప్పుడు టమాటా దొంగల నుంచి టమాటను కాపాడుకోవడం కష్టమవుతుంది. అందుకే కూరగాయల దుకాణం వద్ద బౌన్సర్లను పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.


ఉత్తరప్రదేశ్‌ వారణాసిలో ఓ కూరగాయల దుకాణం దగ్గర వ్యాపారి బౌన్సర్లను ఏర్పాటు చేసుకోవడం వైరల్‌గా మారింది. ఇదేంటని అడిగితే కస్టమర్లు టమాటాలు చోరీకి పాల్పడుతున్నారని..లేదంటే టమాటాల కోసం తోపులాట జరుగుతోందని అందుకే బౌన్సర్లను నియమించుకున్నట్లుగా తెలిపాడు. ఓ మీడియా ఏజెన్సీ ఈ వీడియోని చిత్రీకరించి సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఇది తెగ వైరల్‌ అవుతోంది.

ఉత్తరప్రదేశ్‌ వారణాసిలో కిలో టమాటా ధర 160 రూపాయలకు చేరుకుంది. దీంతో టమాటాలు దొంగిలించే వారితో పాటు షాపుల దగ్గర రద్దీని దృష్టిలో పెట్టుకొని ఓ కూరగాయల వ్యాపారి తన షాపుకు వచ్చే కస్టమర్లను నియంత్రించేందుకు బౌన్సర్లను పెట్టుకున్నాడు. పబ్‌లు, సెలబ్రిటీ ఈవెంట్‌లు, లేదంటే వీఐపీలకు రక్షణగా బౌన్సర్లు ఉంటారు. అయితే వారణాసిలో కూరగాయల వ్యాపారి కొద్దిరోజులుగా బౌన్సర్లను నియమించడం చర్చనీయాంశమైంది.

ఆశ్చర్యపోతున్న జనం..

టమాటా ధరలు పెరగడంతో జనం వాటిని దొంగిలిస్తున్నారని..50,100 గ్రాములు కొనుగోలు చేసి అదనంగా ఒకటి రెండు కాయలు తీసుకుంటూ నష్టం కలిగిస్తున్నారని..అందుకే ఈ ఆలోచన చేసినట్లుగా తెలిపాడు. తన షాపుకు వచ్చే కస్టమర్లను దూరంగా నిల్చొనెలా చూడటంతో పాటు ఎలాంటి బేరాలు ఆడకుండా కొనుగోలు చేసేందుకు సౌకర్యంగా ఉండేందుకే బౌన్సర్లను పెట్టుకున్నట్లుగా ఆ వ్యాపారి అజయ్‌ ఫౌజీ తెలిపాడు. అయితే కూరగాయల దుకాణం దగ్గర బౌన్సర్లు కాపలాగా ఉండటాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారు. ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.

పీటీఐ వివరణ..

టొమాటోల ధర ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారణాసిలోని ఒక కూరగాయల షాపు యజమాని తన షాపు దగ్గర బౌన్సర్లను నియమించినట్లుగా పీటీఐ ఉదయం వీడియోతో కూడిన ఓ కథనాన్ని పోస్ట్ చేసింది. అయితే సదరు కూరగాయల వ్యాపారి ఓ రాజకీయ నాయకుడని ..టమాటా ధరల పెంపుపై రాజకీయ కోణంతోనే విమర్శించేందుకే ఇలా చేసినట్లు పీటీఐ దృష్టికి రావడంతో వార్తను, వీడియోని తొలగించింది. ఈ వార్త విషయంలో పూర్తి వివరాలు సేకరించకుండా పొరపాటు చేశామని..ఇకపై అలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తామని పాఠకులకు సవరణతో కూడిన ట్వీట్‌ని షేర్ చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news