ఇకపై సీలింగ్‌ ఫ్యాన్లకు ఆ గుర్తు లేకపోతే లక్షల్లో ఫైన్‌, జైలు శిక్ష కూడా..

-

కొత్తగా సీలింగ్‌ ఫ్యాన్‌ కొంటుకున్నారా.. ఇకపై చూడాల్సింది క్వాలిటీ, కంపెనీ మాత్రమే కాదు ఇంకోటి కూడా ఉంది. సీలింగ్‌ ఫ్యాన్‌లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యాన్‌ విక్రయించే వ్యాపారులు, తయారుచేసే సంస్థలకు కొత్త నిబంధనలు పెట్టింది. ఇకపై ఫ్యాన్‌లపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌(BIS)మార్కు ఉన్న ఫ్యాన్‌లనే విక్రయించాలని కొత్త కండీషన్ పెట్టింది. నాణ్యతలేని ఫ్యాన్‌ల దిగుమతికి అడ్డుకట్ట వేయడంతో పాటు దేశీయ తయారీ సంస్థలను ప్రోత్సహించాలని ఈ నిర్ణయం తీసుకుంది

fan cleaing

మార్కెట్‌లో విక్రయించే వందల రకాల కంపెనీలు, వేల డిజైన్లలో వస్తున్న సీలింగ్‌ ఫ్యాన్‌లలో చాలా వాటిల్లో నాణ్యత ఉండటం లేదు. దీనికి సంబంధించి డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్‌ ఆగస్ట్ 9న ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకు సీలింగ్ ఫ్యాన్‌లకు బిఐఎస్‌ సర్టిఫికేషన్ రూల్స్ లేవు. కాని ఇకపై బీఐఎస్ మార్క్ లేని ఎలక్ట్రిక్ సీలింగ్ ఫ్యాన్ల ఉత్పత్తి చేయడం, విక్రయించడం,దిగుమతి చేసుకోవడం కలిగి నిషేధమని డీపీఐఐటీ ఈ నోటిఫికేషన్‌లో పేర్కొంది

సీలింగ్ ఫ్యాన్‌ల విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు ..నోటిఫికేషన్ విడుదల చేసిన ఆరు నెలల తర్వాత నుంచి అమల్లోకి రానున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే బీఐఎస్‌ చట్ట ప్రకారం రెండేళ్ల జైలుశిక్ష లేదా రెండు లక్షల జరిమానా విధిస్తారు. రెండవసారి అంతకంటే ఎక్కువ సార్లు రూల్స్ బ్రేక్ చేస్తే వారికి 5లక్షల జరిమానా విధిస్తారట. వస్తువుల విలువకు 10 రెట్ల జరిమానా వసూలు చేస్తారు. ఎంఎస్‌ఎస్‌ఈ సెక్టార్‌కు మాత్రమే ఈ క్వాలిటీ కంట్రోల్‌ను అమలు చేసేందుకు 12నెలల పాటు గడువు ఇస్తున్నట్లుగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

ఇక వచ్చే ఏడాదిలో సీలింగ్‌ ఫ్యాన్లపై బీఐఎస్‌ మార్క్‌ లేకపోతే.. అస్సామే..! మీరు తీసుకునేప్పుడు కూడా ఈ మార్క్‌ ఉన్నవి మాత్రమే చూసుకోవాలి. అప్పుడే నకిలీ ఉత్పత్తులకు అడ్డుకట్ట వేయొచ్చు.l

Read more RELATED
Recommended to you

Latest news