టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత గొడవ నెట్ ప్రాక్టీస్ వంటిది అని అన్నారు. తాము నెట్ ప్రాక్టీస్ చేసి, ఎదుటివాడిపై (పార్టీపై) గట్టిగా ఫైట్ చేస్తామని అన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా టిక్కెట్ అడగవచ్చునని తెలిపారు ఆయన. ఈ నెల 6న కేసీ వేణుగోపాల్ హైదరాబాద్‌కు రానున్నట్లు వెల్లడించారు రేవంత్ రెడ్డి. బోయినపల్లిలోని రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌పై ఏఐసీసీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. హైదరాబాద్ వేదికగా ఈ నెల 16, 17 తేదీల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వెల్లయించారు రేవంత్ రెడ్డి. సీడబ్ల్యుసీ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించాలని ఏఐసీసీకి గతంలో లేఖ రాసినట్లు వెల్లడించారు . ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నాటి హైదరాబాద్ సంస్థానానికి చెందిన వ్యక్తి అని, రజాకార్ల చేతిలో ఖర్గే కుటుంబం చనిపోయిందన్నారు రేవంత్ రెడ్డి.