డీఎంకేను ఢీకొట్టేందుకు సూపర్ స్కెచ్ వేసిన బిజేపీ.. పీల్డ్ లోకి పవర్ స్టార్..

-

దేశమంతా బిజేపీకి సానుకూల వాతావరణం కనిపిస్తోంది.. కానీ తమిళనాట మాత్రం కమలం పార్టీ పాచికలు పారడంలేదు.. డీఎంకేను ఢీకొట్టే బలం ఆ పార్టీకి సరిపోవడం లేదు.. దీంతో సూపర్ స్కెచ్ తో బిజేపీ గ్రౌండ్ లోకి దిగబోతుంది.. పవర్ స్టార్ ను పీల్డ్ లోకి దింపి.. వచ్చె ఎన్నికల నాటికి అధికారంలోకి రావాలని భావిస్తోంది.. ఇంతకీ పవర్ స్టార్ ను వాడుకోవాలని కమలం పార్టీ ఎందుకు అనుకుంటోంది..? డీఎంకేను ఢీకొట్టాలంటే ఆయన సహకారం తప్పదా..?

కర్ణాటక, తమిళనాడులో పుల్ మీల్స్ కోసం బిజేపీ ఎదురుచూస్తోంది.. ప్రతి సారి ఓటు షేర్ పెంచుకుంటున్నా.. అధికారంలోకి మాత్రం రాలేకపోతోంది.. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.. దీంతో బిజేపీ అగ్రనేతలు కొత్త స్కెచ్ తో ముందుకెళ్లబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.. ఏపీ రాజకీయాల్లో ప్రభంజనంతో సంచలనంగా మారిన పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సేవలను వాడుకోవాలని చూస్తోందట..

సీని గ్లామర్ తో పాటు.. మొన్నటి ఎన్నికల్లో కూటమి విజయంలో కీలక పాత్ర, లడ్డూ వివాదంతో హిందూత్వ జెండాను భుజాన వేసుకున్న తీరు.. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ ఇవన్నీ కూడా ప్రధాని మోడీని ఆకర్షించేలా చేశాయి.. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదయ్ నిధి స్టాలీన్ కు పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇవ్వడం.. మాజీ సీఎం ఎంజీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తడంతో ఆ రాష్టరాజకీయాల్లో పవన్ కళ్యాణ్ హాట్ టాపిక్ గా మారారు..

పవన్ కళ్యాణ్ ద్వారా తమిళనాడులో పాగా వెయ్యాలని బిజేపీ ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది.. 36 అసెంబ్లీ స్తానాలున్న.. తమిళనాడులో బిజేపీ ఒక్క స్తానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది.. ఓటు షేర్ పెంచుకుంటున్నప్పటికీ.. అధికారాన్ని చేజిక్కించుకోలేకపోతుంది.. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉండటంతో ఇప్పటి నుంచి పవన్ ను తమిళనాడులో ప్రచారం చేయించాలని ఆ పార్టీ భావిస్తోందట.. ఏపీకి సరిహద్దు రాష్టంగా తమిళనాడు ఉండటంతో.. పవన్ కళ్యాణ్‌ కు అభిమానులు ఎక్కువ..ఈ కోణంలో ఆయన సేవలను వినియోగించుకోవాలని కమలం పార్టీ ఆలోచిస్తోందట.. ఈ ప్లాన్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news